వీఆర్‌ఏల సమ్మెను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి

ABN , First Publish Date - 2022-08-11T06:05:18+05:30 IST

వీఆర్‌ఏల సమ్మెను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ వీఆర్‌ఏల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు వినతిపత్రం అందజేశారు.

వీఆర్‌ఏల సమ్మెను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి
కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు వినతిపత్రం అందజేస్తున్న వీఆర్‌ఏలు

కోదాడటౌన్‌, ఆగస్టు 10: వీఆర్‌ఏల సమ్మెను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ వీఆర్‌ఏల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వీఆర్‌ఏ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ వీఆర్‌ఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వీఆర్‌ఏలు లక్ష్మారెడ్డి, వెంకటే శ్వరరావు, కోటి, రవి, వీరయ్య, నాగమణి, స్నేహ పాల్గొన్నారు. 

వీఆర్‌ఏలకు పేస్కేల్‌ అమలు చేయాలి: సీపీఎం

సూర్యాపేట రూరల్‌:  వీఆర్‌ఏలకు పేస్కేల్‌  అమలు చేయాలని ిసీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సూర్యా పేట తహసీల్దార్‌  కార్యాలయం ఎదుట చేస్తున్న వీఆర్‌ఏల సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు. వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కోట గోపి, ఎల్గూరి గోవింద్‌, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు. 

వీఆర్‌ఏలకు నేతల సంఘీభావం

చిలుకూరు: వీఆర్‌ఏల సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్క రించాలని వీఆర్‌ఏల సంఘం జిల్లా చైర్మన్‌ నర్సయ్య, కన్వీనర్‌ మధు సూధన్‌రావులు సూచించారు. తమ సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తున్న వీఆర్‌ఏలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కోకన్వీనర్‌ వెంకన్న, విఆర్‌ఏలు నాగరాజు, సురేష్‌, రవి, వీరస్వామి, అలివేలు, మాధవి, ప్రసాద్‌, కనేందర్‌ పాల్గొన్నారు.




Updated Date - 2022-08-11T06:05:18+05:30 IST