సమ్మె విజయవంతం చేసి కార్మిక శక్తిని చాటాలి

ABN , First Publish Date - 2021-12-03T06:33:16+05:30 IST

సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్‌ల ను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ తలపెట్టి న మూడు రోజుల సమ్మెను విజయవంతం చేసి కార్మిక శక్తిని చాటాలని కార్మిక సంఘా ల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

సమ్మె విజయవంతం చేసి కార్మిక శక్తిని చాటాలి
ఓసీపీ-3 గేట్‌మీటింగ్‌లో మాట్లాడుతున్న వెంకట్రావు

- కార్మిక సంఘాల జేఏసీ 

యైటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 2: సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్‌ల ను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ తలపెట్టి న మూడు రోజుల సమ్మెను విజయవంతం చేసి కార్మిక శక్తిని చాటాలని కార్మిక సంఘా ల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం ఓసీపీ-3 కృషిభవన్‌లో జరిగిన గేట్‌మీటింగ్‌లో టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ నా యకులు రియాజ్‌అహ్మద్‌, యాదగిరి సత్తయ్య, జనక్‌ప్రసాద్‌, రాజారెడ్డి, వైవీ రావులు మాట్లాడారు. డిసెంబరు 9,10,11 తేదీల్లో తలపెట్టిన సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం బొగ్గు బ్లాక్‌లను వేలం వేసే ప్రక్రియలో భాగంగా సింగరేణి నాలుగు బ్లాక్‌లను వేలం వేయడానికి నోటిఫికేషన్‌ ఇచ్చిందని, దీన్ని సమష్టిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సమ్మె డిమాండ్లలో డిపెండెంట్‌ వయస్సు 40 ఏళ్లకు పెంచాలని, మారు పేర్లతో ఉన్న కార్మికుల వారసులకు ఒకేదఫా అవకాశం కల్పించాలని మరో తొమ్మిది డిమాండ్లను యామాన్యం ముందు ఉంచినట్టు తెలిపారు. 

ఫ గోదావరిఖని: బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ ఈ నెల 9, 10, 11 తేదీల్లో జరిగే సింగరేణి సమ్మెను విజయవంతం చేయాలని విప్లవ సంఘాల జేఏసీ నాయకులు ఐ కృష్ణ, జంగిలి రాజేశ్వర్‌రావు, జీ రాములు పిలుపునిచ్చారు. గురువారం ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 11ఇంక్లైన్‌పై జరిగిన గేట్‌ మీటింగ్‌లో వారు మాట్లాడారు. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు అవకాశవాదం అయినప్పటికీ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె చేయాలన్నా రు. కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేసిందని, కోల్‌ ఇండియాలోని బొగ్గు బ్లాకులను కూడా వేలం పాట వేయాలని కుట్ర పన్నుతుంతోందన్నారు. దీనిలో భాగంగా సింగరేణిలో కూడా నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తోందని, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సమ్మె చేయలేని స్థితిలో జాతీయ కార్మిక సంఘాలు ఉన్నాయన్నారు. సింగరేణిలో జరిగే సమ్మె కనువిప్పు కలగాలని, మోదీ, కేసీఆర్‌లకు ఈ సమ్మె హెచ్చరికగా నిలుస్తుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. గేట్‌ మీటింగ్‌లో విప్లవ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఈదనూరి నరేష్‌, అశోక్‌, తోకల రమేష్‌, మిర్జా ఫయాజ్‌ బేగ్‌, కొమురయ్య, యూసుఫ్‌, బాబు, చంద్ర య్య, మొండయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T06:33:16+05:30 IST