కార్యకర్తలే బలం

ABN , First Publish Date - 2021-02-25T05:42:55+05:30 IST

దుబ్బాక, ఫిబ్రవరి24: కార్యకర్తల బలంతోనే దుబ్బాక నుంచి తెలంగాణ సాధన వరకు కదిలిందని, అదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు ఉద్యమంగా సాగించాలని మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు కొత్తప్రభాకర్‌రెడ్డి కోరారు.

కార్యకర్తలే బలం
దుబ్బాకలో మాట్లాడుతున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

 దేశంలో ఎక్కడా లేని పథకాలు ఇక్కడే ఉన్నాయి

 సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం

 తప్పుడు ప్రచారాలను తిప్పికొడదాం

 మెదక్‌ పార్లమెంటు సభ్యుడు కొత్తప్రభాకర్‌రెడ్డి


దుబ్బాక, ఫిబ్రవరి24: కార్యకర్తల బలంతోనే దుబ్బాక నుంచి తెలంగాణ సాధన వరకు కదిలిందని, అదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు ఉద్యమంగా సాగించాలని మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు కొత్తప్రభాకర్‌రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రంపై మనకున్న కడుపునొప్పి, తెలంగాణలో సీఎం ఏర్పాటు చేసిన సంక్షేమాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా..? అంటూ ఆయన ప్రశ్నించారు. బుధవారం దుబ్బాకలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు లేవని, సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు తెలంగాణను కొనియాడుతున్నారన్నారు. కరోనా సంక్షోభంలో కూడా నిధుల కొరత ఏర్పడినా వాటిని ఎదుర్కొని పింఛన్లు అందిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలను గడపగడపకూ తెలియజేసి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సభ్యత్వాల సేకరణ జరపాలన్నారు. రాష్ట్రంలోనే దుబ్బాక నియోజకవర్గంలో అత్యధిక పింఛన్లు అందిస్తున్నామని, బీడీకార్మికులకు ఎక్కడాలేని విధంగా జీవనభృతిని అందిస్తున్నామని ఆయన చెప్పారు. దుబ్బాకను రానున్న నాలుగు నెలల్లో మల్లన్నసాగర్‌తో సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. కార్యకర్తలు చిన్నచిన్న మనస్పర్థలను పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. దుబ్బాకను తామే అభివృద్ధి చేయగలమని ప్రజలకు కూడా తెలిసిందని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి ఫరిదోద్దీన్‌, ఎమ్మెల్సీ ఫారుక్‌ హుస్సేన్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణశర్శ, బక్కి వెంకటయ్య, ఆర్‌.రాజమౌళి, మనోహర్‌రావు, వెంకటనర్సింహారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనితా, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఏంపీపీ పుష్పలత, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ శ్రీలేఖ, పీఏసీఎస్‌ చైర్మెన్‌ కైలాస్‌, పార్టీ  మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు ఆసస్వామి, జిల్లా టెలికాం బోర్డు సభ్యులు పాతూరి శ్రీనివా్‌సగౌడ్‌, సుధీర్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పోతనక రాజయ్య, ఎంపీటీల ఫోరం అధ్యక్షుడు మంద చంద్రసాగర్‌, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జీడిపల్లి రవి, నాయకులు ఎల్లారెడ్డి, రాజలింగం, కాల్వనరేష్‌, రవి, రమేష్‌ పాల్గొన్నారు. 


దుబ్బాకలో బైక్‌ర్యాలీ

దుబ్బాకలోని ఒకటో వార్డులో టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలను వార్డు కౌన్సిలర్‌ నిమ్మరజిత ఆధ్వర్యంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నిర్వహించారు. వార్డులో ప్లాస్టిక్‌ రహితం చేయడానికి జ్యూట్‌బ్యాగ్‌లు, టిఫిన్‌ బాక్సులను పంపిణీ చేశారు. అనంతరం సుమారు వెయ్యిమందితో బైక్‌ ర్యాలీని నిర్వహించారు. దుబ్బాక మారెమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. దుబ్బాక మాజీ ఏఎంసీ చైర్మన్‌ భాను అందజేసిన విరాళాన్ని ఎంపీ అందజేశారు. అనంతరం దుబ్బాకలోని అన్ని వార్డుల్లో బైక్‌ ర్యాలీనీ భారీగా నిర్వహించారు. 


రేణుకాదేవికి ప్రత్యేక పూజలు

దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి రేణుకా ఎల్లమ్మ ఆలలయంలో బుధవారం మెదక్‌ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాభివృద్ధికి పాటుపడతానని హామీనిచ్చారు. సర్పంచు సద్దిరాజిరెడ్డి, ఎంపీపీ పుష్ఫలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఆసయాదగిరి ఉన్నారు. 


క్రీడలు మానసికోల్లాసానికి దోహదం

క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి అన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్మారకార్థం నెలరోజులుగా దుబ్బాకలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగిసింది. గెలిచిన జట్టుకు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి బహుమతులను అందజేశారు. మిరుదొడ్డి మండలం భూంపల్లి జట్టుకు మొదటి బహుమతిగా రూ.30వేలు, దుబ్బాకకు జట్టుకు రెండో బహుమతిగా రూ.15వేలు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సోలిపేట సతీ్‌షరెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ కాల్వనరేష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T05:42:55+05:30 IST