Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 19 Jan 2022 18:12:13 IST

Viral Video: పారాగ్లైడింగ్‌కు వెళ్లిన దంపతులు.. ఆకాశంలో భార్య వింత ప్రవర్తన.. నవ్వులు పూయిస్తున్న వీడియో

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: పారాగ్లైడింగ్‌కు వెళ్లిన దంపతులు.. ఆకాశంలో భార్య వింత ప్రవర్తన.. నవ్వులు పూయిస్తున్న వీడియో

కొన్ని సాహస క్రీడలు చూడాటానికి బాగుంటాయి. కానీ ఆ స్థానంలో మనం ఉంటే మాత్రం చాలా భయపడతాం. పారాగ్లైడింగ్, బంగీజంప్ తదితర సాహస క్రీడలు కూడా చూడటానికి ఎంతో బాగుంటాయి. కానీ కొందరు అలా చేసేందుకు మాత్రం సాహసించరు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. ఇక వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భార్యను విహారయాత్రకు తీసుకెళ్లిన భర్త.. ఆమెతో పారాగ్లైడింగ్ చేయిస్తాడు. భార్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా తీసుకెళ్తాడు. గాలిలోకి వెళ్లాక ఆమె ప్రవర్తించిన తీరు ప్రస్తుతం అందరికీ నవ్వు తెప్పిస్తోంది.

Viral Video: పారాగ్లైడింగ్‌కు వెళ్లిన దంపతులు.. ఆకాశంలో భార్య వింత ప్రవర్తన.. నవ్వులు పూయిస్తున్న వీడియో

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదుగానీ నెటిజన్లను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది. భార్యను సరదాగా విహారయాత్రకు తీసుకెళ్లిన భర్త.. ఆమెకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పారాగ్లైడింగ్ చేయడానికి బలవంతంగా ఒప్పిస్తాడు. భర్త బలవంతం చేయడంతో కాదనలేక ఒప్పుకొంటుంది. కానీ ఆకాశంలోకి వెళ్లగానే ఆమెకు భయం మొదలవుతుంది. కాపాడండి.. కాపాడండి.. అంటూ కేకలు వేస్తుంది.

రైలు దగ్గరికి వస్తుందనగా మహిళను పట్టాల మీదకు తోసేసిన యువకుడు.. చివరకు ఏమైందంటే..

గైడ్ ఎంత ధైర్యం చెప్పినా ఆమె మాత్రం అరుపులు ఆపదు. అంతటితో ఆగకుండా తన భర్తను దూషిస్తూ ఆమె మాట్లాడిన మాటలు నవ్వు తెప్పిస్తాయి. ‘దేవుడా.. నేను ఎందుకు ఇతన్ని పెళ్లి చేసుకున్నానా?.. వద్దన్నా బలవంతంగా పారాగ్లైడింగ్ చేయించాడు.. చంపేయాలి’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. చమత్కరిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

పాముతోనే నీరు తాగించాడు.. ఇతను మామూలు వ్యక్తి కాదు.. చూస్తే అవాక్కవుతారు..


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.