Jul 9 2021 @ 00:10AM

కథ థ్రిల్‌ చేసింది

నేను ఇప్పటివరకూ చాలా కథలు విన్నాను. ఈ థ్రిల్లర్‌ కథ నాకు బాగా నచ్చింది. నటనకు ఆస్కారమున్న పాత్ర. ఆదితో తొలిసారి నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని కథానాయిక పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా ఎం. వీరభద్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కిరాతక’. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను గురువారం చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా డాక్టర్‌ నాగం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ‘‘మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఆగస్టు 13 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు.  పూర్ణ, దాసరి అరుణ్‌కుమార్‌, దేవ్‌గిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.