లేడీ కాదు కిలేడీ.. ఈమె ఫ్రొఫైల్ పిక్‌తో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే అస్సలు ఓకే చేయకండి.. లేకుంటే ఈ 49 మంది ఎదుర్కొన్న పరిస్థితే..

ABN , First Publish Date - 2022-06-24T23:06:32+05:30 IST

ఆ యువకుడికి ఆ యువతి జిమ్‌లో పరిచయమైంది.. అతడితో స్నేహం పెంచుకుంది.. ఏకాంత ప్రదేశానికి వెళ్దామని అడిగింది..

లేడీ కాదు కిలేడీ.. ఈమె ఫ్రొఫైల్ పిక్‌తో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే అస్సలు ఓకే చేయకండి.. లేకుంటే ఈ 49 మంది ఎదుర్కొన్న పరిస్థితే..

ఆ యువకుడికి ఆ యువతి జిమ్‌లో పరిచయమైంది.. అతడితో స్నేహం పెంచుకుంది.. ఏకాంత ప్రదేశానికి వెళ్దామని అడిగింది.. అక్కడకు వెళ్లాక తను అర్ధనగ్నంగా మారి ఆ యువకుడితో కూడా బట్టలు విప్పించింది.. ఇద్దరివీ కలిసి ఫొటోలు తీసింది.. అనంతరం ఆ ఫొటోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది.. రూ.8 లక్షలు ఇవ్వకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, అత్యాచారం కేసు పెడతానని బెదిరింపులకు దిగింది.. కొంత డబ్బు ఇచ్చాక, ఆ యువకుడు మొత్తం విషయాన్ని తన తండ్రికి చెప్పేశాడు.. దీంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.. పోలీసులు నిందితుల బండారం మొత్తాన్ని బయటపెట్టారు. 


ఇది కూడా చదవండి..

Petdog birthday party: భారీ స్థాయిలో శునకం జన్మదిన వేడుకలు.. ఏకంగా 4 వేల మందికి భోజనాలు


ఆ యువతికి చెందిన గ్యాంగ్ చాలా రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్, నజీబాబాద్, మొరాదాబాద్ వంటి నగరాలకు చెందిన ధనవంతులను టార్గెట్‌గా చేసుకుని హానీ ట్రాప్‌నకు పాల్పడుతోంది. ముష్కాన్ పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేసి అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెడతారు. తమ రిక్వెస్ట్‌లకు స్పందించిన వారి ఫోన్ నెంబర్లు సంపాదించి వారిని ట్రాప్ చేస్తారు. ఆ తర్వాత బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతారు. ఆ గ్యాంగ్‌లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు. 


వీరు గత నాలుగు నెలల్లో వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులను బెదిరించి లక్షల్లో డబ్బు సంపాదించినట్టు పోలీసులు తెలిపారు. ఆ గ్యాంగ్ లీడర్‌ను పోలీసులు ఇప్పటికే రెండుసార్లు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన అతను తాజాగా మరో వ్యక్తిపై హనీ ట్రాప్‌నకు పాల్పడి పరారీలో ఉన్నాడు. ఆ గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2022-06-24T23:06:32+05:30 IST