Twitter ను Elon Musk కొనడానికి, ఆ జర్నలిస్ట్‌కు సంబంధమేంటి..? సరిగ్గా నాలుగున్నరేళ్ల క్రితం..

ABN , First Publish Date - 2022-04-26T18:14:57+05:30 IST

ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ చేజిక్కించుకున్నారు

Twitter ను Elon Musk కొనడానికి, ఆ జర్నలిస్ట్‌కు సంబంధమేంటి..? సరిగ్గా నాలుగున్నరేళ్ల క్రితం..

ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ చేజిక్కించుకున్నారు. సుమారు 44 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.30 లక్షల కోట్లు) వెచ్చించి ట్విటర్ సంస్థను ఆయన కొనుగోలు చేశారు. టెస్లా కార్ల కంపెనీ వ్యవస్థాపకు, స్పేస్ ఎక్స్ సీఈవో కూడా అయిన మస్క్‌ ట్విటర్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేశారు.


ట్విటర్‌ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయడానికి ఓ జర్నలిస్ట్ వ్యాఖ్యలు కూడా కారణమై ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. సుమారు నాలుగున్నరేళ్ల క్రితం 2017 డిసెంబర్ 21 రాత్రి 11.20కి `ఐ లవ్ ట్విటర్` అని మస్క్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు స్పందనగా అమెరికా జర్నలిస్ట్ డేవ్ స్మిత్.. `అయితే మీరు ఆ సంస్థను కొనేయండి` అని రిప్లై ఇచ్చారు. దానికి మస్క్ స్పందిస్తూ.. `ఆ సంస్థ విలువ ఎంత?` అని అడిగారు. 


ఆ సంభాషణ జరిగిన 52 వారాలకు మస్క్ ట్విటర్ సంస్థను చేజిక్కించుకున్నారు. ఈ సందర్భంగా డేవ్ స్మిత్ అప్పటి సంభాషణను గుర్తు చేసుకున్నారు. నా జీవితంలో ఎప్పటికీ ఆ సంభాషణను మర్చిపోలేనని అన్నారు. అప్పటి స్క్రీన్ షాట్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.



Updated Date - 2022-04-26T18:14:57+05:30 IST