Abn logo
Jun 3 2020 @ 05:13AM

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

పలుచోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ 


ఎల్‌బీనగర్‌ జోన్‌బృందం/శేరిలింగంపల్లి జోన్‌బృందం/ముషీరాబాద్‌ జోన్‌బృందం/మెహిదీపట్నం జోన్‌బృందం/దుండిగల్‌/ప్రగతినగర్‌/తార్నాక/కూకట్‌పల్లి/బేగంపేట/అమీర్‌పేట/ రాంనగర్‌/మదీన/రాజేంద్రనగర్‌/అల్వాల్‌/నేరేడ్‌మెట్‌/అడ్డగుట్ట/రామంతాపూర్‌/బోయిన్‌పల్లి/గోల్నాక/ఎర్రగడ్డ/మంగళ్‌హాట్‌/కవాడిగూడ/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల జాతీయజెండాను, టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. సీఎం కేసీఆర్‌ రాష్ర్టానికి అందిస్తున్న సేవలను ప్రశంసించారు. 


ఫ సరూర్‌నగర్‌ స్టేడియం ఆవరణలో అమరవీరుల స్థూపం వద్ద మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ హరీష్‌ నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, కార్పొరేటర్‌ అనితాదయాకర్‌రెడ్డి, పాల్గొన్నారు. నాదర్‌గుల్‌ బాలాజీనగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి సబితారెడ్డి ఆవిష్కరించారు. మేయర్‌ పారిజాతానర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కొత్త మనోహర్‌రెడ్డి, రామిడి రాంరెడ్డి, యాతం శ్రీశైలంయాదవ్‌, చిగిరింత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. 


ఐఎ్‌ససదన్‌ డివిజన్‌ వార్డు కార్యాలయం వద్ద  టీఆర్‌ఎస్‌ యాఖత్‌పురా నియోజకవర్గ ఇన్‌చార్జి సామ సుందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మన్సూరాబాద్‌ చౌరస్తా, ఇందిరానగర్‌ కాలనీల్లో ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఫతుల్లాగూడలో టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌ ఎల్‌బీనగర్‌ ఇన్‌చార్జి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌, తుర్కయంజాల్‌ రైతు సేవా సహకార సంఘంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, మున్సిపల్‌ కార్యాలయం వద్ద చైర్‌ పర్సన్‌ మల్‌రెడ్డి అనురాధరాంరెడ్డి, ఆర్‌డీవో కార్యాలయం వద్ద ఆర్డీవో అమరేందర్‌, న్యూనాగోల్‌లోని సీపీఐ కార్యాలయంలో బొడ్డుపల్లి కృష్ణ, బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో మేయర్‌ పారిజాతారెడ్డి, మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో మేయర్‌ దుర్గాదీ్‌పలాల్‌, నాదర్‌గుల్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద  అందెల శ్రీరాములుయాదవ్‌, చంద్రపురి కాలనీలోని బీజేపీ కార్యాలయంలో సామ రంగారెడ్డి, వంగా  మధుసూదన్‌రెడ్డి,  మలక్‌పేట మార్కెట్‌లో చైర్మన్‌ రాధ, ఆజంఅలీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అల్మా్‌సగూడ 25వ వార్డు కార్పొరేటర్‌ ముత్యాల లలితాకృష్ణ టీఆర్‌ఎ్‌సలో చేరారు. 


మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, శేరిలింగంపల్లి, మాదాపూర్‌, కొండాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతాల్లో ఆయా పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, నిథమ్‌లో డైరెక్టర్‌ చిన్నంరెడ్డి, అధికారులు, కొండాపూర్‌ 8వ బెటాలియన్‌లో కమాండెంట్‌ మురళీకృష్ణ, మాదాపూర్‌ ఇజ్జత్‌నగర్‌లో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.


బేగంపేటలోని స్వామి రామానంద స్మారక సంస్థలో ఆ కమిటీ చైర్‌ పర్సన్‌, మాజీ ప్రధాని కూతురు వాణిదేవి, బాపూనగర్‌లో టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌, కార్పొరేటర్‌ శేషుకుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.  


ముషీరాబాద్‌లోని మహ్మదీయ ఫంక్షన్‌ హాల్‌లో టీఆర్‌ఎస్‌ యువజన నగర నాయకుడు ముఠా జైసింహా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్లు వి.శ్రీనివా్‌సరెడ్డి, ఎడ్ల భాగ్యలక్ష్మిహరిబాబుయాదవ్‌, ముఠా పద్మానరేష్‌, బి.హేమలతరెడ్డి, జి.లాస్యనందితలతో కలిసి రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు.


దుండిగల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి ఎమ్మెల్సీ సుంకరి రాజు, చైర్‌పర్సన్‌ సుంకరి కృష్ణవేణి, ప్రగతినగర్‌ చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, మేయర్‌ కొలన్‌ నీలాగోపాల్‌రెడ్డి, తెలంగాణ రైతుబంధు సమితి కార్యాలయంలో చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కూకట్‌పల్లి బస్టాప్‌, మూసాపేట, కేపీహెచ్‌బీకాలనీ బాలాజీనగర్‌లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బాలానగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు వేర్వేరుగా వేడుకలు నిర్వహించారు. 


హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ ఎం.కృష్ణ, తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రవీణ్‌రాజు, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో అడ్మిన్‌ అడిషనల్‌ డీసీపీ లావణ్య, మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో డీసీపీ రక్షితామూర్తి, పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్‌లో డా.లక్ష్మారెడ్డి, జూపార్కలో క్యూరేటర్‌ ఎన్‌.క్షితిజ, సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్డులో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఐల కొమురయ్య, బేగంపేటలోని మెట్రో రైలు భవన్‌లో ఎండీ ఎన్వీఎ్‌సరెడ్డి, సనత్‌నగర్‌లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో సభ్య కార్యదర్శి నీతూప్రసాద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 


గోల్నాక డివిజన్‌ గంగానగర్‌లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, అనంతరాంనగర్‌ కాలనీలో బీజేపీ నగర మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, టీడీపీ నగర కార్యాలయంలో పార్టీ నగర కన్వీనర్‌ పి.సాయిబాబా, నల్లెల కిశోర్‌, బాల్‌రాజ్‌గౌడ్‌, ఎల్‌బీనగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, అంబర్‌పేట మెయిన్‌రోడ్‌లో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్‌గౌడ్‌, చార్మినార్‌ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమితి సభ్యులు యూసుఫ్‌ హష్మీ, ఫలక్‌నుమాలోని రెయిన్‌బో అనాథ నిలయంలో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్‌పీ క్రాంతికుమార్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 


బుద్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, దుర్గానగర్‌ చౌరస్తాలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌, బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మేయర్‌ బుర్ర మహేందర్‌గౌడ్‌, సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, పుస్తకాల నర్సింగ్‌రావు, హైదర్‌గూడలో టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామేశ్వర్‌రావు, బీజేపీ నాయకులు మల్లారెడ్డి, కొమురయ్య, అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీసీ యాదయ్య, నేరేడ్‌మెట్‌ చౌరస్తాలో కార్పొరేటర్‌ శ్రీదేవి పాల్గొన్నారు. 


బోయిన్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, హబ్సిగూడ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి, రామంతాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌, ఎర్రగడ్డ బి.శంకర్‌లాల్‌నగర్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఓల్డ్‌బోయిన్‌పల్లి, ఫతేనగర్‌, బాలానగర్‌లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. 


గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, టీజేఎఫ్‌ నేత, ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్‌, ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌అలీ, వై.నరేందర్‌రెడ్డి, అమర్‌నాథ్‌, రెండు ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన అధ్యాపకులు నివాళులర్పించారు.  


సరోజిని ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వైరాగ్యం రాజలింగం ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఆర్‌ఎంవో నజీఫాబేగం, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మోదినీ, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు బాలరాజ్‌, శివకుమార్‌ పాల్గొన్నారు. 


ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ సుజాత, స్టేడియం అడ్మినిస్ట్రేటర్‌ రవి పాల్గొన్నారు.  


సీఎం జర్నలిస్టులను ఆదుకోవాలి - అల్లం నారాయణ

కరోనా కష్టకాలంలో ఎంతో కష్టపడుతున్న తెలంగాణ జర్నలిస్టులను సీఎం కేసీఆర్‌ ఆదుకోవాలని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ కోరారు. మంగళవారం ఆయన గన్‌పార్క్‌ వద్ద అమరులకు నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ కాలంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. 

 

టీయూడబ్ల్యూజే నిరసన..

జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీయూడబ్ల్యూజే నేతలు శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్‌, విరాహత్‌ అలీ డిమాండ్‌ చేశారు. అమరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వం వర్కింగ్‌ జర్నలిస్టుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసన తెలిపారు.  


Advertisement
Advertisement