జగన్‌ పాదంతో రాష్ట్రం సర్వనాశనం

ABN , First Publish Date - 2022-07-07T05:59:35+05:30 IST

రాష్ట్రంలో జగన్‌ సీఎంగా ముదనష్టపు పాదం మోపడంతో పురోగతిలో ఉన్న నవ్యాంధ్ర తిరోగమనంలోకి పోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్‌ పాదంతో రాష్ట్రం సర్వనాశనం
కోడూరు బాదుడే - బాదుడులో కరపత్రాలు పంచుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కోడూరు బాదుడే - బాదుడులో మాజీ మంత్రి దేవినేని ఉమా 

జి.కొండూరు, జూలై 6: రాష్ట్రంలో జగన్‌ సీఎంగా ముదనష్టపు పాదం మోపడంతో పురోగతిలో ఉన్న నవ్యాంధ్ర తిరోగమనంలోకి పోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోడూరులో బుధవారం రాత్రి బాదుడే - బాదుడులో పాల్గొని ప్రజలకు కర పత్రాలు పంపిణీ చేశారు. రైతులు, ప్రజల కోసం తాగు, సాగు నీరు నిమిత్తం చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.5 వేల కోట్లు మంజూరు చేయించి 3 వేల కోట్లు ఖర్చు చేయిస్తే దాన్ని నాశనం చేశారన్నారు.  గ్యాస్‌ బండ రూ.50లు పెరిగింది. రాష్ట్రంలో వ్యాట్‌ ఎందుకు తగ్గించడని ప్రశ్నించారు. ప్లీనరీలకు బస్సులివ్వాలని ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలను ప్రభుత్వ అధికారుల ద్వారా బెదిరించడం దారుణమన్నారు. ధాన్యం డబ్బులు ఇప్పటికీ రాలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్‌లో ఒక్క లోన్‌ ఇవ్వలేదన్నారు. తిరిగి తెలుగుదేశంను అధికారంలోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ధనేకుల సాంబశివరావు (బుల్లిబాబు), జువ్వా రామకృష్ణ (రాంబాబు), ఉయ్యూరు వెంకట నరసింహారావు, పజ్జూరు రవికుమార్‌, పటాపంచల నరసింహారావు, లంక రామకృష్ణ, గుడిపూడి శంకర్‌, లంక లితీష్‌, మన్నె కోటిబాబు, నంబూరు శ్యామ్‌, కస్తాల వర ప్రసాద్‌, సుకవాసి శ్రీహరి, మన్నం వెంకట చౌదరి, ధనేకుల శ్రీకాంత్‌,  పాల్గొన్నారు. 


 అధిక ధరలతో సారా వైపు మద్యం ప్రియుల చూపు : దేవదత్‌

గంపలగూడెం : అధిక ధరలకు మద్యం కొనలేక నాటుసారాకు అలవాటు పడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శావల దేవదత్‌ అన్నారు. బుధవారం గోసవీడులో బాదుడే - బాదుడులో పాల్గొని మాట్లాడుతూ ఉచితంగా అందే ఇసుకను రద్దు చేసి మహోన్నతమైన శాండ్‌ పాలసీ పేరుతో ఇసుక ధర నిర్ణయించారన్నారు. రూ.1,500 ఉన్న ట్రాక్టర్‌ ఇసుకను రూ.10 వేలు చేశారని, రూ.5 వేలు ఉన్న లారీ ఇసుకను రూ.50 వేలు చేశారన్నారు. సిమెంట్‌ వ్యాపారం మొత్తాన్ని సిండికేట్‌గా మార్చి సిమెంట్‌ ధరలను పెంచార న్నారు. గతంలో టన్ను ఇనుముఽ రూ.45 వేలు ఉండగా ప్రస్తుతం రూ.80 వేలు అయ్యిందన్నారు.టీడీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, రేగళ్ల వీరారెడ్డి, కొత్త రజనీకాంత్‌, బూరుగు నారాయణ, ఇనుగంటి మధు, దిరిశాల వెంకటకృష్ణారావు, మానుకొండ రామకృష్ణ, సానికొమ్ము నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T05:59:35+05:30 IST