కేంద్రాన్ని చూసి రాష్ట్రం బుద్ధి తెచ్చుకోవాలి

ABN , First Publish Date - 2022-05-23T04:56:59+05:30 IST

కేంద్రాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని చమురు ధరలు తగ్గించాలని మెదక్‌, సంగారెడ్డి జిల్లాల బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్‌, నరేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కేంద్రాన్ని చూసి రాష్ట్రం బుద్ధి తెచ్చుకోవాలి
మెదక్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌

మోదీ నిర్ణయంతో  పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల తగ్గింపు

రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ను తగ్గించాలి

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల బీజేపీ అధ్యక్షులు  గడ్డం శ్రీనివాస్‌, నరేందర్‌రెడ్డి

మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి అర్బన్‌, మే 22: కేంద్రాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని చమురు ధరలు తగ్గించాలని మెదక్‌, సంగారెడ్డి జిల్లాల బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్‌,  నరేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రఽధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిందన్నారు.  కేంద్రం తరహాలోనే తెలంగాణ సర్కార్‌ కూడా చమురుపై రాష్ట్ర పరిధిలోని పన్నును తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయాల్లో వారు వేర్వేరుగా మాట్లాడుతూ...  పెట్రోల్‌, డీజీల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా తగ్గిచిందన్నారు. లీటరు పెట్రోల్‌పై రూ. 8, లీటర్‌ డీజిల్‌పై రూ.6 సుంకం తగ్గించింది. మోదీ నిర్ణయంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.9.50 పైసలు, డీజిల్‌ ధర రూ.7 మేర తగ్గిందన్నారు. ఎల్పీజీ సిలిండర్‌ ధరను కూడా రూ.200 తగ్గించిందన్నారు. ధరలు ప్రజలకు భారమవుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్నారు. సమావేశాల్లో మెదక్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్‌, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్‌, మండలాధ్యక్షుడు ప్రభాకర్‌, సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి హరీశ్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి, బీజైవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్‌, పట్టణ అధ్యక్షుడు రవిశంకర్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర  రైతులను విస్మరించి ఇతరులకు సాయమా?

అల్లాదుర్గం, మే 22: ఆర్థిక సమస్యలతో అసువులు బాసిన రాష్ట్రానికి చెందిన రైతులను ఆదుకోని రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులకు ఆర్థిక సాయం చేయడం విడ్డూరంగా ఉందని మెదక్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బాలయ్య అన్నారు. ఆదివారం అల్లాదుర్గంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని సీఎం తన స్వప్రయోజనాల కోసం ఇతర రాష్ట్ర రైతులను ఆదుకుంటూ, రాష్ట్ర రైతులను విస్మరిస్తున్నారని ఆయన ఎద్దెవా చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధరలు తగ్గించక పోవడం శోచనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జహీరాబాద్‌ పార్టమెంట్‌ ఇన్‌చార్జి ప్రభాకర్‌గౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం 

నారాయణఖేడ్‌, మే 22: కేంద్ర ప్రభుత్వం, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు తగ్గించడానికి వ్యాట్‌ను తగ్గించడాన్ని హర్షిస్తూ ఆదివారం నారాయణఖేడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం  చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, నాయకులు పాల్గొన్నారు. 

 రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరలను తగ్గించాలి

నర్సాపూర్‌, మే 22: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డిజీల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించి ప్రజలపై కొంత భారాన్ని తగ్గించినందున రాష ్ట్రప్రభుత్వం కూడా పన్నులు తగ్గించి చిత్తశుద్ధి చాటుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం నర్సాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగాయపల్లిగోపి విలేకరులతో మాట్లాడుతూ పేద, సామాన్య ప్రజలపై పడిన భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందన్నారు. సమావేశంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. 

సీఎం కేసీఆర్‌ వ్యాట్‌ను తగ్గించాలి

మాసాయిపేట, మే 22: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నందున, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ను తగ్గించాలని బీజేపీ మండలాధ్యక్షుడు వేణు శనివారం డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు యాదగిరి, స్వామి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కేంద్రం ధరలను తగ్గించడంపై హర్షం

పాపన్నపేట, మే 22: పెరిగిన పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడంపై బీజేపీ నాయకులు ఆదివారం మండలంలోని కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతో్‌షచారి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు నరేశ్‌కుమార్‌, మండల ప్రధాన కార్యదర్శి భిక్షపతిచారి పాల్గొన్నారు. 

ధరలను తగ్గించకుంటే ఆందోళన చేపడుతాం

చిన్నశంకరంపేట, మే 22: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని, లేని యెడల ఆందోళనలు చేపడుతామని మెదక్‌ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి నందారెడ్డి ఆరోపించారు.  కేంద్ర ప్రభుత్వం చుమురు ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసకున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు ధరలు తగ్గించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించకుండా ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మంగళి యాదగిరి, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పోగుల రాజు, నాయకులు మూర్తి, అశోక్‌ పాల్గొన్నారు.




Updated Date - 2022-05-23T04:56:59+05:30 IST