డబుల్‌ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రం దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2020-06-06T11:25:48+05:30 IST

రాష్ట్రంలోని పేద ప్రజల ఆత్మగౌర వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని శాసన

డబుల్‌ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రం దేశానికే ఆదర్శం

నియోజకవర్గానికి మరో పది వేల ఇళ్ల మంజూరుకు కృషి చేస్తా

శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

విజయదశమి నాటికి లక్ష ఇళ్లు  

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి


కోటగిరి, జూన్‌ 5: రాష్ట్రంలోని పేద ప్రజల ఆత్మగౌర వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కోటగిరి మండలంలోని కొల్లూర్‌ గ్రామంలో రూ.5లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, సోంపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో గల రాంగంగానగర్‌ గ్రామ ంలో నిర్మించిన 40 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను శుక్రవారం ఆయన మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సభాపతి మాట్లాడుతూ, గతంలో ఇంటి నిర్మాణ పథకం దివంగత సీఎం ఎన్టీఆర్‌ ప్రారంభించారని గుర్తుచేశారు. గత 30 యేళ్ల ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఇళ్లు పేదలకు అందలే దన్నారు. అప్పట్లో ఇంటి నిర్మాణ పథకం కింద రాష్ర్టాని కి రూ.500 కోట్లు మాత్రమే కేటాయించేవారన్నారు. రా ష్ట్రం ఏర్పడిన తర్వాత పేదల సొంతింటి కలను నేరవే ర్చేందుకు సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకా న్ని ప్రవేశపెట్టారన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు కలి పి ఇంటి నిర్మాణానికి ఇచ్చే మొత్తం తెలంగాణలో మం జూరు చేసిన ఇళ్లకు సమానమని స్పీకర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.20వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం కొనసాగుతో ందన్నారు.


బాన్సువాడ నియోజకవర్గంలో రూ.500 కోట్ల వ్యయంతో 5వేల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. నియోజకవ ర్గానికి మరో పదివేల డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంజూ రు చేయించేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. రా ష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్లను పక్క రాష్ర్టాల ప్రజలు వచ్చి చూసి తమ ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్ట డం లేదని ప్రశ్నిస్తున్నారని అన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు పేరుతో ఎవరైనా డబ్బులు తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు పార్టీ నుంచి తొలగిస్తామని ఆయన హెచ్చరించారు.


 విజయదశమి నాటికి పేదలకు లక్ష ఇళ్లు.. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

రాష్ట్రంలో రూ.20వేల కోట్ల వ్యయంతో 2.85లక్షల ఇ ళ్లు మంజూరు చేశామని, ప్రస్తుతం 2లక్షల ఇళ్లు నిర్మా ణంలో ఉన్నాయని, వచ్చే దసరా నాటికి లక్ష ఇళ్లను పూ ర్తి చేసి పేదలకు అందిస్తామని మంత్రి వేముల ప్రశాం త్‌రెడ్డి వెల్లడించారు. ఇళ్లతోపాటు సీసీరోడ్లు, డ్రైనేజీలను నిర్మించామన్నారు. గతంలో ప్రభుత్వాలు మంజూరు చే సిన ఇళ్లు కనబడకుండా పోయాయని, కేసీఆర్‌ హయా ంలో నిర్మిస్తున్న ఇళ్లు, కాలనీలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా యని వివరించారు. ప్రతియేటా ప్రభుత్వం ఇళ్లను మం జూరు చేసేందుకు కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నా రు.


ఇళ్లు రాని వారు నిరాశ చెందవద్దని, దశల వారీగా అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు.  బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మించిన ఇళ్లు ఆదర్శం గా నిలిచాయని మంత్రి పేర్కొన్నారు. 5వేల ఇళ్లు పూర్తి చేయడంలో సభాపతి ఎంతగానో కృషి చేస్తున్నారని ఆ యన ప్రశంసించారు. బాన్సువాడ నియోజకవర్గంలో పై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ చూపుతారని మంత్రి వెల్ల డించారు. అనంతరం రాంగంగానగర్‌ గ్రామం పేరును పీఎస్‌ఆర్‌నగర్‌గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని గ్రామ స్థులు మంత్రికి అందించారు. ఆ తర్వాత  మండలంలో ని ఆయా గ్రామాలకు చెందిన 49 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశా రు. డబుల్‌బెడ్‌రూం పొందిన మహిళలతో కలిసి సభా పతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి దాండియా ఆడి ఉత్సాహపరిచారు. 


అధికారులను ప్రశంసించిన స్పీకర్‌, మంత్రి

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ఏఈ నాగేశ్వర్‌రా వును సభాపతి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అ భినందించారు. కోటగిరి తహసీల్దార్‌ విఠల్‌ పనితీరుపై సభాపతి ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల దరి చేర్చడంలో అధికారుల పాత్ర ఎంతగానో ఉంటుంద ని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ నారా యణరెడ్డి, జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, టీఆర్‌ఎస్‌ నియోజక వర్గ ఇన్‌చార్జీ పోచారం సురేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గంగాధర్‌, ఎంపీపీ సునీత, వైస్‌ఎంపీపీ గంగాధర్‌ పటే ల్‌, జడ్పీ కో-ఆప్షన్‌ మెంబర్‌ సిరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-06T11:25:48+05:30 IST