పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-23T06:22:53+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఇందన చార్జీలు తగ్గించినందున తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలి

ఉట్నూర్‌, మే 22 : కేంద్ర ప్రభుత్వం ఇందన చార్జీలు తగ్గించినందున తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.  ఆదివారం స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు  రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పెందూర్‌ ప్రభాకర్‌, బీజేపీ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ. 7 తగ్గించిందన్నారు. దేశంలోని 23 రాష్ట్రాలు వ్యాట్‌ ట్యాక్స్‌ లీటరుకు పది తగ్గించాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు కొలిపాక రాజశేఖర్‌, నాయకులు రామగిరి వాసు, సీపతి లింగాగౌడ్‌, సాడిగే రాజేశ్వర్‌, బింగి వెంకటేష్‌, రామ కృష్ణ, బండారి వెంకటేష్‌, విజయ్‌, శ్రీకాంత్‌, మధుకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T06:22:53+05:30 IST