స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే

ABN , First Publish Date - 2022-01-24T06:24:04+05:30 IST

ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచేలా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కేఎస్‌ఎన్‌ రావు అన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
రిలే నిరాహార దీక్షల శిబిరంలో పాల్గొన్న ఉద్యోగులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు కేఎస్‌ఎన్‌ రావు

కూర్మన్నపాలెం,జనవరి 23: ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచేలా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కేఎస్‌ఎన్‌ రావు అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 346వ రోజు కొనసాగాయి. ఆదివారం ఈ దీక్షలలో టీపీపీ,ఎఫ్‌ఎండీ, పీఈఎం, ఆర్‌ఈడీ విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో కేఎస్‌ఎన్‌ రావు మాట్లాడుతూ నూతన వేతనాల అమలులో జాప్యానికి నిరసనగా ఈ నెల 25న ప్రధాన పరిపాలనా భవనం ఎదుట  ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మరో నాయకుడు ఎన్‌.రామారావు మాట్లాడుతూ  ప్రభుత్వరంగ సంస్థలు ఉంటేనే యువతకి ఉపాధి దొరుకుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ శిబిరంలో పలువురు ఉక్కు కార్మికులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-24T06:24:04+05:30 IST