‘హమ్‌’ చేసిన ‘గూగుల్‌’ పాట చెప్పేస్తుంది!

ABN , First Publish Date - 2020-10-19T06:26:36+05:30 IST

మనకు కొన్నిసార్లు ఓ పాట మనసులో మెదులుతుంది. పల్లవి, చరణం ఎంతకూ గుర్తుకు రావు. టీవీలోనో,

‘హమ్‌’ చేసిన ‘గూగుల్‌’ పాట చెప్పేస్తుంది!

న్యూఢిల్లీ, అక్టోబరు 18: మనకు కొన్నిసార్లు ఓ పాట మనసులో మెదులుతుంది. పల్లవి, చరణం ఎంతకూ గుర్తుకు రావు. టీవీలోనో, రేడియోలోనో ఆ పాట వస్తే ‘అర్రె.. నేననుకుంటున్నది’ ఇదే కదా? అనిపిస్తుంది. ఇకపై ఈ పరిస్థితి ఉండదు.

మీరు మైక్రోఫోన్‌ను ఆన్‌ చేసి ట్యూన్‌ను హమ్‌ చేసినా, ఈల వేసినా పాటను కనిపెట్టేయగల టూల్‌ను గూగుల్‌ అందుబాటులోకి తెచ్చింది.

ఇందుకోసం గూగుల్‌ యాప్‌ కొత్త వెర్షన్‌ లేదా సెర్చ్‌ విడ్జెట్‌కు అప్‌గ్రేడ్‌ కావాలి. ఐఫోన్‌లో ఇంగ్లి్‌షలో, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో 20కి పైగా భాషల్లో ఈ సదుపాయం పొందొచ్చు. ప్రస్తుతానికి ఫోన్లలోనే అందుబాటులో ఉంది.


Updated Date - 2020-10-19T06:26:36+05:30 IST