Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫిట్స్ కారణంగా చనిపోయాడంటూ భర్త అంత్యక్రియలు.. రెండు రోజుల తర్వాత కొడుకు బయటపెట్టిన నిజం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..

‘‘మామగారూ మీ కొడుకు ఫిట్స్ వచ్చి కిందపడి చనిపోయాడు’’.. అంటూ ఓ మహిళ ఫోన్ చేసింది. ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ వినడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. తన కొడుకుపై విధి పగబట్టింది.. అనుకుంటూ బాధపడుతూనే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే రెండు రోజుల అనంతరం మృతుడి కొడుకు బయటపెట్టిన నిజాలు తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. భర్త మృతి చెందిన రోజు రాత్రి ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పాడు. సినిమా సీన్‌ను తలపించేలా జరగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

బెంగళూరు నగరంలోని కరేనాహళ్లి ప్రాంతానికి చెందిన రాఘవేంద్ర(40), శైలజ(30) దంపతులు. వీరికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 27న రాఘవేంద్ర మృతి చెందాడు. రాఘవేంద్ర తల్లిదండ్రులకు శైలజ ఫోన్ చేసింది. ‘‘మామ గారూ.. మీ కొడుకు ఫిట్స్ వచ్చి కిందపడి చనిపోయాడు’’.. అంటూ రాఘవేంద్ర తండ్రి చంద్రశేఖర్‌కు ఏడుస్తూ చెప్పింది. దీంతో షాక్ అయిన వారు.. పరుగు పరుగున ఇంటికి చేరుకున్నారు. ఆమె చెప్పింది నిజమని నమ్మిన వాళ్లు అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత రెండు రోజులకు రాఘవేంద్ర కొడుకు బయటపెట్టిన నిజాలు అందరినీ షాక్‌కు గురి చేశాయి.

పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి.. ఏడాది తర్వాత అనుకోని ఘటన.. చివరకు కొడుకుతో సహా భార్య ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

రాఘవేంద్ర మృతి చెందిన రోజు ఎవరో కొత్త వ్యక్తి తమ ఇంటికి వచ్చాడని రాఘవేంద్ర తండ్రికి మనువడు తెలిపాడు. దీంతో అనుమానం వచ్చి రాఘవేంద్ర ఇంటికి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా విషయం తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శైలజ సమీపంలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉండేది. ఈ క్రమంలో అక్కడే పనిచేసే హనుమంత అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రాఘవేంద్రకు ఈ విషయం తెలిసి.. భార్యను గట్టిగా మందలించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని శైలజ, ఆమె తల్లి లక్ష్మీదేవమ్మ, ప్రియుడు హనుమంత కలిసి కుట్ర పన్నారు.

నీతో ఓ మాట చెప్పాలంటూ భార్యను తీసుకెళ్లిన భర్త.. చివరగా అతను చెప్పిన మాటలు విని.. ఆమె మైండ్ బ్లాక్..

డిసెంబర్ 27న రాత్రి ఇంట్లోకి వచ్చిన హనుమంత.. శైలజ, ఆమె తల్లితో కలిసి రాఘవేంద్రను కాళ్లు, చేతులు పట్టుకుని దాడి చేశారు. దీంతో రాఘవేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. శబ్దాలు విని రాఘవేంద్ర కొడుకు నిద్ర లేచాడు. తండ్రిపై దాడి చేయడం చూసి.. నాన్నను కొట్టొద్దు అంటూ ప్రాథేయపడ్డాడు. దీంతో ఈ విషయం బయట ఎవరికన్నా చెబితే చంపేస్తామంటూ బాలున్ని కూడా బెదిరించారు. ఎట్టకేలకు నిజం బయటపడడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

ఫొటోలు చూసి యువతులను సెలెక్ట్ చేసుకోవాలట.. మనిషికో రేటు కట్టేశారు.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగానే..

ఇవి కూడా చదవండిImage Caption

లూడో గేమ్ వేదికగా.. రాజస్తానీ మహిళ, పాకిస్తాన్ యువకుడి ప్రేమాయణం.. భర్త, రెండేళ్ల బాబును వదిలి వెళ్తుండగా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఒక్క విషయంలో ప్రజలు ఎగతాళి చేస్తున్నారని.. భార్యతో ఇలా అనడంతో..భార్య ప్రియుడితో వెళ్లిపోయిందనే కోపంతో.. కూతురును అడ్డుపెట్టుకుని అతడు వేసిన ప్లాన్.. విచారణలో విస్తుపోయే నిజాలుభర్తను వదిలి తల్లిదండ్రుల వద్ద ఉంటూ.. ఇటీవల ఆస్పత్రికి వెళ్లి ఆమె చేసిన నిర్వాకం.. భర్తకు తెలియడంతో..పెళ్లిరోజున భార్యపై ప్రేమ చూపించాల్సింది పోయి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతడు చెప్పిన మాట.. చివరకు అంతా షాక్..నన్నే మాస్కు పెట్టుకోలేదని అడుగుతావా... అంటూ ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..
Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement