Abn logo
Jan 24 2021 @ 03:58AM

మద్యం మత్తులో తల్లిని చంపిన తనయుడు

నాగర్‌ కర్నూల్‌ క్రైం, జనవరి 23: మద్యం మత్తులో ఓ యువకుడు కన్న తల్లినే హత్య చేశాడు. ఈ ఘటన నాగర్‌ కర్నూల్‌ జిల్లా గుడిపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శుభాకర్‌ హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. లాక్‌డౌన్‌ సమయంలో సొంత గ్రామానికి వచ్చిన అతడు మద్యానికి బానిసై డబ్బుల కోసం రోజూ తల్లి ఇస్తారమ్మతో గొడవ పడేవాడు. శనివారం సాయంత్రం మద్యం మత్తులో ఇంటికొచ్చి డబ్బుల కోసం కర్రతో తల్లి తల పగులగొట్టాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement