నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, కథానాయకుడు సాయి శ్రీనివాస్ సోదరుడు గణేష్ బెల్లంకొండ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’. ఆయనకు జోడీగా వర్ష బొల్లమ్మ నటి ంచారు. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శక త్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్గ్లింప్స్కు మంచి ఆదరణ దక్కుతోంది. పెళ్లి నేపథ్యంలో ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రంగా దర్శకుడు మలిచారు. టైటిల్‌కి తగ్గట్టే అమాయకుడైన యువ కుడి పాత్రలో గణేష్ ఒదిగిపోయారు. వర్ష బొల్లమ్మ గడుసు అమ్మాయిగా మెప్పించారు. ఈ చిత్రంలో వీకే నరేష్, రావు రమేష్ కీలకపాత్రలు పోషించారు. మహ తి స్వరసాగర్ సంగీతం అందించారు.