ప్రశ్నిస్తేనే సమస్యలకు పరిష్కారం

ABN , First Publish Date - 2021-10-28T06:25:11+05:30 IST

ప్రజా సమస్యలపై అధికారులను ప్రశ్నించాలని ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇక్కడి మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీపీ కోన సంధ్య అధ్యక్షతన ఏర్పాటైన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు.

ప్రశ్నిస్తేనే సమస్యలకు పరిష్కారం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమణమూర్తిరాజు


మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రమణమూర్తిరాజు

అచ్యుతాపురం రూరల్‌, అక్టోబరు 27: ప్రజా సమస్యలపై అధికారులను  ప్రశ్నించాలని ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇక్కడి మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీపీ కోన సంధ్య అధ్యక్షతన ఏర్పాటైన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి తహసీల్దార్‌ పూడిమడకలో చేసిన అవినీతిపై తాను ప్రశ్నించానని, చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకుని వెళ్లానని చెప్పారు.  ప్రతి సమస్యను సర్వసభ్య సమావేశంలో లేవనెత్తితే పరిష్కారానికి ఆస్కారం ఉంటుందన్నారు.   ప్రధాన పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా స్తంబ్దంగా ఉండడం ఏమిటన్నారు. అనంతరం కొందరు సభ్యులు తమ పంచాయతీల్లో సమస్యల చిట్టాను వినిపించారు.  విద్యుత్‌ పరికరాల కొనుగోలు, నిర్వహణ కాంట్రాక్టరు చేయకపోవడంతో గ్రామాల్లో వీధి లైట్లు పనిచేయడం లేదని, బ్లీచింగ్‌ కూడా వేరొకరికి అప్పగించారని పలువురు వివరించారు.  సమావేశానికి హాజరు కాని మత్స్యశాఖ అధికారిపై ఆ శాఖ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. 130 మంది విద్యార్థులున్న ఎం.జగన్నాథపురం పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని అక్కడి ప్రజాప్రతినిధులు వివరించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ లాలం రాము, ఎంపీడీవో కృష్ణ, తహసీల్దార్‌ రాంబాయి, కో-ఆప్షన్‌ సభ్యుడు నర్మాల కుమార్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T06:25:11+05:30 IST