కాంగ్రెస్‌తోనే రైతు సమస్యలు పరిష్కారం

ABN , First Publish Date - 2022-05-20T05:38:41+05:30 IST

కాంగ్రెస్‌తోనే రైతు సమస్యలు పరిష్కారం

కాంగ్రెస్‌తోనే రైతు సమస్యలు పరిష్కారం
మాట్లాడుతున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

రంగారెడ్డి అర్బన్‌, మే 19: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. గాంధీభవన్‌లో గురువారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టపరమైన అధికారాలతో రైతుకమిషన్‌, వ్యవసాయాన్ని పండుగ చేసే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. కౌలు రైతులకు ప్రతి ఎకరానికి రూ.15వేలు, ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమిలేని రైతుకూలీలకు ఏడాదికి రూ.12వేలు, రైతులపంటకు గిట్టుబాటుధర, ప్రతి గింజను కొంటామని చెప్పారు. మూతబడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పారు. భూమిలేని రైతులకు బీమా, ఉపాధిహామీకి వ్యవసాయాన్ని అనుబంధం చేస్తామని చెప్పారు.

21 నుంచి ఊరూరా కాంగ్రెస్‌ రచ్చబండ

ఈనెల 21 నుంచి ఊరూరా కాంగ్రెస్‌ పార్టీ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనుందని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న ఈ రచ్చబడ్డ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కిసాన్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఐఎన్‌టీయూసీ ప్రెసిడెంట్‌ జితేందర్‌రెడ్డి, పీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌లీడర్‌ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఇన్‌చార్జి రాంరెడ్డి, చేవెళ్ల, షాద్‌నగర్‌ నియోజకవర్గ పార్టీ సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం, వీర్లపల్లి శంకర్‌, జడ్పీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ జంగారెడ్డి పాల్గొన్నారు.  

రైతు సమస్యలపై ఉద్యమిస్తాం

మంచాల, మే 19: రైతు సమస్యలపై ఉద్యమిస్తామని కాంగ్రెస్‌ పార్టీ మంచాల మండల అధ్యక్షుడు వింజమూరి రాంరెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈనెల 21నుంచి కాంగ్రెస్‌ తలపెట్టిన రైతు రచ్చబండ కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని గురువారం మంచాలలో నిర్వహించారు. సమావేశంలో నరేందర్‌రెడ్డి, సంతో్‌షగౌడ్‌, ప్రేమాకర్‌రెడ్డి, బుగ్గరాములు, గణేష్‌, సత్తయ్య, మల్లేష్‌, గాలయ్య, ఆర్‌.బాష పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T05:38:41+05:30 IST