పోరాటంతోనే సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2021-04-17T04:59:15+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి పేర్కొన్నారు.

పోరాటంతోనే సమస్యల పరిష్కారం

ప్రొద్దుటూరు టౌన్‌, ఏప్రిల్‌ 16: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సంఘం కార్యాలయం వద్ద ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపా ధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం దశాబ్దాలు గా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని  దీంతో ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. దశలవారీ ఆందోళనలో భాగంగా ఎంఈవోలు, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పి స్తామని, 26వ తేదీ జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తామన్నారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధా నం అమలు చేయాలని, పీఆర్‌సీ నివేదికను ప్రకటించి 2018 జులై నుంచి 55 శాతం పిట్‌ మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ సమస్యను పరిష్క రించాలని, రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని పేర్కొన్నా రు.  కార్యక్రమంలో సంఘం నాయ కులు కృష్ణారెడ్డి, శ్రీని వాసులరెడ్డి, కుళ్లాయిరెడ్డి, మునివర్ధన్‌ కుమార్‌, సుధాకర్‌, వెంకటేశ్వర్లు, నరసింహకుమార్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-17T04:59:15+05:30 IST