సోషల్ మీడియాలో క్రేజ్ రావడంతో భర్తకు గుడ్‌బై.. యూట్యూబ్‌లో బూతు వీడియోలు.. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2021-11-09T21:21:36+05:30 IST

టిక్‌టాక్ ఉన్న సమయంలో చాలా మంది అందులో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు. తమిళనాడుకు చెందిన సుగంధి కూడా ఇలాగే టిక్‌టాక్ వీడియోలు చేస్తుండేది. ఈమె భర్త ఆర్మీలో పని చేస్తుంటాడు. ఏడాది వయసున్న పాపతో

సోషల్ మీడియాలో క్రేజ్ రావడంతో భర్తకు గుడ్‌బై.. యూట్యూబ్‌లో బూతు వీడియోలు.. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటంటే..

సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయినప్పటి నుంచి.. చాలా మంది పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ తదితర వేదికల ద్వారా ఫేమస్ అవుతున్నారు. సరికొత్త ఆలోచనలు చేస్తూ వీడియోలు చేస్తుంటారు. ఈ క్రమంలో మంచి క్రేజు తెచ్చుకోవడంతో పాటూ డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నారు. కొందరైతే సాధారణ పరిస్థితి నుంచి ఒక్కసారిగా స్టార్లు అవుతుంటారు. ఒక్కసారిగా వచ్చిన స్టార్‌డమ్‌తో ఉక్కిరిబిక్కిరవుతుంటారు. చుట్టూ ఉన్నవారిని కూడా పట్టించుకోనంత బిజీ అవతుంటారు. తమిళనాడులో ఇలాగే ఓ మహిళకు సోషల్‌మీడియాలో క్రేజ్ రావడంతో ఏకంగా భర్తనే పక్కన పట్టేసింది. చివరకు య్యూటూబ్‌‌లో బూతు వీడియోలు చేసే స్థాయికి దిగజారింది. చివరకు ఆమె పరిస్థితి ఏమైందో తెలుసుకుందాం..


టిక్‌టాక్ ఉన్న సమయంలో చాలా మంది అందులో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు. తమిళనాడుకు చెందిన సుగంధి కూడా ఇలాగే టిక్‌టాక్ వీడియోలు చేస్తుండేది. ఈమె భర్త ఆర్మీలో పని చేస్తుంటాడు. ఏడాది వయసున్న పాపతో కలిసి సుగంధి ఒక్కటే ఉంటోంది. రోజూ వీడియోలు చేస్తూ ఉండేది. అయితే క్రేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో హాట్‌హాట్ వీడియోలు చేయడం మొదలెట్టింది. వీడియోలు వైరల్ అవడంతో ఆమెకు మంచి పేరొచ్చింది. దీంతో భర్తను కూడా దూరం పెట్టింది. పాపతో కలిసి స్నేహితురాలు ఇంట్లో ఉంటూ వీడియోలు చేసేది. ఈ క్రమంలో దివ్య అనే మహిళతో దుర్భాషలాడతూ చేసే వీడియోలు వైరల్ అవుతుండేవి.


అయితే వీడియోలు అసభ్యకరంగా ఉండడంతో దివ్య అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సుగంధి మాత్రం తీరు మార్చుకోకుండా వీడియోలు చేసేది. తనను ఎవరైనా విమర్శిస్తే.. వారిని దూషిస్తూ మళ్లీ వీడియోలు చేసేది. టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత య్యూటూబ్‌లో ఛానల్ క్రియేట్ చేసి వీడియోలు చేస్తుండేది. అయితే ఇటీవల మధురైకి చెందిన ఓ మహిళ ప్రతిష్టను దిగజార్చే విధంగా సుగంధి వీడియోలు చేసింది. మహిళ ఫిర్యాదుతో సైబర్ క్రైం పోలీసులు సుగంధిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బు కోసం అసభ్యకర వీడియోలు చేసిన సుగంధి.. చివరికి ఇలా జైలుపాలైంది.

Updated Date - 2021-11-09T21:21:36+05:30 IST