చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-07-07T05:10:33+05:30 IST

అమృత్‌ సరోవర్‌ పథకంలో భాగంగా గ్రామాల్లో చేప టట్టిన చెరువుల పూడికతీత పనులను బుధవారం కేంద్ర జలశక్తి అభియాన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అనురాధ ఆధ్వర్యంలోని సభ్యులు పరిశీలించారు.

చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలి
ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో నీటిని ఒడిసిపట్టేందుకు పల్లె ప్రకృతివనంలో ఏర్పాటుచేసిన గుంతను పరిశీలిస్తున్న అనురాధ తదితరులు

- కేంద్ర జలశక్తి అభియాన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అనురాధ 

- అచ్చంపేట, మన్ననూర్‌, వంగూరు మండలాల్లో చెరువులను పరిశీలించిన సెంట్రల్‌ టీం సభ్యులు 


అచ్చంపేట అర్బన్‌/మన్ననూర్‌/వంగూరు/ఊర్కొండ, జూలై 6: అమృత్‌ సరోవర్‌ పథకంలో భాగంగా గ్రామాల్లో చేప టట్టిన చెరువుల పూడికతీత పనులను బుధవారం కేంద్ర జలశక్తి అభియాన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అనురాధ ఆధ్వర్యంలోని సభ్యులు పరిశీలించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్‌, వంగూరు మండలా ల్లో సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఆయా మండలాల్లోని గ్రామాల్లో ఉన్న చెరువులను పరిశీ లించారు. పథకం ఉద్దేశాన్ని సభ్యులు గ్రామస్థులకు వివ రించారు. చెరువుల్లో పూడికతీత, భూగర్భజలాల పెంపు నకు తీసుకొంటున్న చర్యలపై సభ్యులు అధికారులకు పలు సూచనలు చేశారు. అచ్చంపేట మండలంలోని హాజీపూర్‌ గ్రామంలో చెరువును, నీటి ఇంకుడు గుంత లను అనురాధ పరిశీలించారు. అలాగే, గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి విద్యార్థులు, చిన్నారులతో ముచ్చటించారు. ఆయాచోట్ల మొక్కలు నాటి, నీళ్లు పోశారు. కార్యక్రమంలో జిల్లా అధి కారులు, డీఎస్‌.ప్రసాద్‌, డీఆర్‌డీవో పీడీ నర్సింగరావు, ఏవో నటరాజు, ఎంపీడీవో మధుసూదన్‌గౌడు, ఈజీఎస్‌ ఏపీవో పర్వతాలు ఉన్నారు. అదేవిధంగా, ఉమ్మడి అమ్రా బాద్‌ మండల పరిధిలోని మొలకమామిడి, కొత్తపల్లి, చెన్నంపల్లి గ్రామాల్లో చెరువుల పూడికతీత పనులను పరిశీలించారు. అమ్రాబాద్‌ ఎంపీపీ శ్రీనివాసులు, ఎంపీ డీవో రామ్మోహన్‌, ఎంపీఈవో వెంకటయ్య, ఏపీవో రఘు, ఈజీఎస్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వంగూరు మండలంలోని ఉమ్మా పూర్‌లో వావిళ్లకుంట అభివృద్ధి, నీటి నిల్వ, భూగర్భ  జలాల పెంపునకు తీసుకొంటున్న చర్యలపై సభ్యులు ఆరా తీశారు. డిండిచింతపల్లిలో పీవీవీలో ఏర్పాటుచేసిన చెక్‌డ్యాంను పరిశీలించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆంజనేయులు, సరిత, డీఆర్‌డీవో నర్సింగరావు, ఏవో నట రాజ్‌, ఎంపీడీవో పవన్‌కుమార్‌, ఏపీవో లక్ష్మయ్య, ఈసీ దేవేందర్‌, పంచాయతీ కార్యదర్శులు అల్లాజీ, ప్రసన్న తదితరులున్నారు. ఊర్కొండ మండలంలోని ముచ్చర్ల పల్లి, జగబోయిన్‌పల్లి గ్రామాల్లో జలశక్తి అభియాన్‌లో నిర్వహించిన పనులతో పాటు, వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి చేసిన ఏర్పాట్లను సభ్యులు పరిశీలించి, సం తృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సెంట్రల్‌ వాటర్‌ స్కీం సభ్యులతో పాటు, ఎంపీడీవో ప్రభాకర్‌, సర్పంచులు వీరెడ్డిపర్వత్‌రెడ్డి, కవితరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గోపాల్‌ గుప్త, పంచాయతీ కార్యదర్శులు శ్రీరామ్‌, హరికృష్ణ ఉన్నారు. 

 భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలి..

నారాయణపేట టౌన్‌/ధన్వాడ/ఊట్కూర్‌ : వర్షపు ప్రతీ నీటిబొట్టును వృథా చేయకుండా భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి అభియాన్‌ నోడల్‌ అదికారి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఉప కార్యదర్శి రాకేష్‌ కటియార్‌ సూచించారు. నారాయణపేట జిల్లాలో జలశక్తి అభియాన్‌ అమలు, సాధించిన అభివృద్ధి తీరుతెన్నులను పర్యవేక్షించడానికి నారాయణపేట జిల్లా కు బుధవారం రాగా, కలెక్టర్‌ హరిచందన పుష్పగుచ్చ మందించి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లో నోడల్‌ అధికారికి అటవీ, గ్రామీణ అభివృద్ధి, భూగర్భజలాలు, ఇరిగేషన్‌, వ్యవసాయ అనుబంధం, ఉపాధి హామీ ద్వారా జిల్లాలో జలశక్తి అభియాన్‌ అమలు తీరును, భూగర్భ జలాలు పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ టీవీ తెరపై చూపారు. ఈ సందర్భంగా నోడల్‌ అధికారి మాట్లాడారు. జిల్లాకు 75 అమృత సరోవర్‌ మంజూరు చేశామని, వాటిని సకాలంలో పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం నోడల్‌ అధికారి బృందం, అదనపు కలెక్టర్‌ చందార్రెడ్డి తదితరులు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లోని జలశక్తి కేంద్రాన్ని పరిశీలించారు. ధన్వాడ గ్రామంలోని నర్సరీ, వెంకటేశ్వరస్వామి, కోనేరుతో పాటు, పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత, మెట్ల బావిని, ఫాంఫండ్‌, నర్సరీలను వారు పరిశీలించారు. అనంతరం ఊట్కూర్‌ మండలం పెద్దజట్రం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను వారు పరిశీలించి, కూలీలకు పలు సూచనలు చేశారు. ఎంపీడీవో కాళప్ప, ఇతర అధికారులు ఉన్నారు.  



Updated Date - 2022-07-07T05:10:33+05:30 IST