నేను పారిపోయి వచ్చాను, కొంత మంది భయంతో పాటలు పాడుతున్నారు: Shinde camp నుంచి తిరిగొచ్చిన MLA

ABN , First Publish Date - 2022-06-25T02:11:46+05:30 IST

జూన్ 20న ఠాణెలోని ఓ హోటల్‌లో డిన్నర్‌కు షిండే ఆహ్వానించారు. డిన్నర్ ముగిసిన అనంతరం తర్వాత పలువురు ఎమ్మెల్యేలను కార్లలో సూరత్‌కు తరలిస్తున్న విషయం తెలిసింది. దీంతో వెంటనే వెనక్కి రావాలని నిర్ణయించుకున్నాను. ఎలాగోలా తప్పించుకుని బయట పడ్డాను. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాను..

నేను పారిపోయి వచ్చాను, కొంత మంది భయంతో పాటలు పాడుతున్నారు: Shinde camp నుంచి తిరిగొచ్చిన MLA

ముంబై: మహారాష్ట్ర రాజకీయం సంక్షోభం(Maharashtra Politcal Crisis) గంటకో మలుపు తీసుకుంటోంది. తాజాగా షిండే క్యాంపు నుంచి తిరిగి వచ్చిన ఒక ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మంది భయభ్రాంతులతో ఉన్నారని, కొంత మంది ఏం చేయాలో తెలియన పాటలు పాడుతున్నారని, తాను మాత్రం సూరత్ వెళ్లకుండా పారిపోయి వచ్చానని రెబెల్ ఎమ్మెల్యేల్లో ఒకరైన కైలాష్ పాటిల్(Kailas Patil) అన్నారు. శుక్రవారం ఆయన ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. షిండే క్యాంప్ నుంచి ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి వచ్చారు. కాగా, మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు షిండే క్యాంపులోకి కొత్తగా చేరారు.


‘‘జూన్ 20న ఠాణెలోని ఓ హోటల్‌లో డిన్నర్‌కు షిండే ఆహ్వానించారు. డిన్నర్ ముగిసిన అనంతరం తర్వాత పలువురు ఎమ్మెల్యేలను కార్లలో సూరత్‌కు తరలిస్తున్న విషయం తెలిసింది. దీంతో వెంటనే వెనక్కి రావాలని నిర్ణయించుకున్నాను. ఎలాగోలా తప్పించుకుని బయట పడ్డాను. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాను. ఆ తర్వాత ద్విచక్ర వాహనం దొరికింది. దాని సాయంతో ముఖ్యమంత్రి నివాసమైన వర్షాకు చేరుకున్నాను’’ అని పాటిల్ అన్నారు. ఈయనకు ముందు మరొక ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్(Nitin Dheshmuk) సైతం షిండేపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను గుజరాత్‌కు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, అక్కడి నుంచి తప్పించుకుని ముంబైకి వచ్చేశానని అన్నారు. తనకు బలవంతంగా ఏదో ఇంజక్షన్ చేయబోయారని, తనపై హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారని నితిన్ ఆరోపించారు.


ఇదిలా ఉంటే ఏక్‌నాథ్ షిండే యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ‘శక్తిమంతమైన జాతీయ పార్టీ’ మద్దతు తమకు ఉందంటూ నిన్న పరోక్షంగా బీజేపీ (BJP) పేరు చెప్పిన షిండే.. ఒక్క రోజైనా గడవకముందే మాటమార్చారు. జాతీయ పార్టీ ఏదీ తమను సంప్రదించలేదని తాజాగా స్పష్టం చేశారు. ‘శివసేన రెబల్ గ్రూపునకు బీజేపీ మద్దతు ఉందా?’ అన్న ప్రశ్నకు షిండే మాట్లాడుతూ.. ‘‘శక్తిమంతమైన పార్టీ మా వెనక ఉందని చెప్పిన మాట వాస్తవమే. అంటే దానర్థం బాలాసాహెబ్ థాకరే (Balasaheb Thackeray), ఆనంద్ దిఘే (Anand Dighe) శక్తి మాకుందని’’ అని వివరణ ఇచ్చారు.

Updated Date - 2022-06-25T02:11:46+05:30 IST