లయన్స్‌క్లబ్‌ సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2022-05-22T05:42:48+05:30 IST

లయన్స్‌క్లబ్‌ సేవలు అభినందనీయం

లయన్స్‌క్లబ్‌ సేవలు అభినందనీయం
మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

శంషాబాద్‌, మే 21: శంషాబాద్‌లోని క్లాసిక్‌ కన్వెన్షన్‌లో శనివారం రాత్రి లయన్స్‌క్లబ్‌ 105వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి హరీ్‌షరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని  వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్యశిబిరాలు ప్రజలకు ఎంతగానో తోడ్పడుతున్నాయన్నారు. ఈక్లబ్‌ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా లయన్స్‌క్లబ్‌ సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దేశంలోని   వివిధ రాష్ట్రాలకు చెందిన లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులతో పాటు లయన్స్‌ క్లబ్‌ చైర్మన్‌ విద్యాసాగర్‌రెడ్డి వైస్‌చైర్మన్‌ కోటేశ్వరరావు సెక్రటరీ రాధాకృష్ణ జాయింట్‌ సెక్రటరీ రాజీరెడ్డి ట్రెజర్‌గా సంతో్‌షలు పాల్గొన్నారు. అంతకు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

Updated Date - 2022-05-22T05:42:48+05:30 IST