జవానుల సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-12-09T06:35:49+05:30 IST

దేశరక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరజవానుల సేవలు చిరస్మరణీయమని ప్రిన్సిపల్‌ యువరాజ్‌ అన్నారు. అంగళ్లు సమీపంలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో భారత సైనిక దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీని నిర్వహించారు.

జవానుల సేవలు చిరస్మరణీయం
ర్యాలీని నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్‌ యువరాజ్‌

కురబలకోట, డిసెంబరు 8: దేశరక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరజవానుల సేవలు చిరస్మరణీయమని ప్రిన్సిపల్‌ యువరాజ్‌ అన్నారు. అంగళ్లు సమీపంలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో భారత సైనిక దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం విపత్తుల సమయాల్లో సేవలందించడానికి ఎన్‌సీసీ కేడెట్లు సిద్ధంగా ఉండాలన్నారు. అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఆదర్శవంతంగా నిలవాలన్నారు. వీరజవానుల కోసం రూ.13,500 విరాళాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ నవీన్‌కుమార్‌, మంజు, విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T06:35:49+05:30 IST