సైనికుల సేవలు వెలకట్టలేనివి

ABN , First Publish Date - 2021-12-08T05:40:31+05:30 IST

దేశ రక్షణకు సేనికులు చేస్తున్న సేవ లు వెలకట్టలేనివని కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. సాయుధ దళాల ప తాక దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించి న సాయుధ నిధి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ చేతులమీదు గా ప్రారంభించారు.

సైనికుల సేవలు వెలకట్టలేనివి
విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ రవి

 కలెక్టర్‌ గుగులోతు రవి 

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 7: దేశ రక్షణకు సేనికులు చేస్తున్న సేవ లు వెలకట్టలేనివని కలెక్టర్‌ గుగులోతు రవి అన్నారు. సాయుధ దళాల ప తాక దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించి న సాయుధ నిధి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ చేతులమీదు గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంకోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని, వారికి ప్రజలంతా రుణపడి ఉండాల న్నారు. పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల, మౌంట్‌ కార్మెల్‌ పా ఠశాల, ఎస్‌కే ఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ కేడేట్లు ఈ విరా ళాలను సేకరించగా, ఎన్‌సీసీ అధికారులు లెఫ్టినెంట్‌ మారుతి శ్రీహరి రా వు, లెఫ్టినెంట్‌ జగ్‌రాం, కేర్‌ టేకర్‌ మంగ కేడేట్ల విరాళాల సేకరణ తీరు ను పర్యవేక్షించారు. ఈ విరాళాలను మాజీ సైనికులకు, అమరులైన వీర జవాన్‌ కుటుంబాల సంక్షేమానికి వినియోగిస్తామని కేడెట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యాసంస్థల అఽధినేత యాద రామకృష్ణ, ప్రిన్సి పాల్‌ కొక్కు రాజేంధర్‌, 9వ తెలంగాణ బెటాలియన్‌ అధికారి, హవల్దార్‌ గణేష్‌ పవార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T05:40:31+05:30 IST