Advertisement
Advertisement
Abn logo
Advertisement

రామగుండం లయన్స్‌ క్లబ్‌ సేవలు మరువలేనివి

- జిల్లా గవర్నర్‌ నాగుల సంతోష్‌

కళ్యాణ్‌నగర్‌, డిసెంబర్‌ 5 : సమాజసేవలో రామగుండం లయన్స్‌క్లబ్‌ సేవలు ఫ్రశంసనీయమని లయన్స్‌క్లబ్‌ జిల్లా గవర్నర్‌ నాగుల సంతోష్‌ అన్నారు. రామగుం డం లయన్స్‌క్లబ్‌ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం జరిగిన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామ గుండం పట్టణంలోని భక్తాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ 5 బెంచీలు, ఎన్‌టీపీసీ సాయిసేవా సమితిలో 100 కిలోల బియ్యం, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గౌతమినగర్‌ సాయిబాబా దేవాలయంలో ఐదు బెంచీలు పంపిణీ చేశారు. గోదావరిఖని గాందీపార్కు ప్రభుత్వ పాఠశాలలో 5 బేంచీలు, బస్టాండ్‌ సమీపంలోని వెంకటేశ్వర దేవాలయంలో రెండు బెంచీలు, ల యన్స్‌ భవన్‌లో కుట్టు మిషన్‌ కంపెనీ, ట్రై సైకిల్‌ పంపిణీ, కృత్రిమ అవయవాల పంపిణీ, లయన్స్‌భవన్‌లో వంట గదికి భూమి పూజల అలాగే కుట్టు శిక్షణా కేంద్రా న్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగాధర్‌ , తిలక్‌ చక్రవర్తి, మనో జ్‌కుమార్‌, బంక రామస్వామి, రవీంద్రాచారి, మినేష్‌నారాయణ, ప్రమోద్‌కుమార్‌ రెడ్డి, సోమారపు సత్యనారాయణ, రమణారెడ్డి, ఆంజనేయులు, సారయ్య, రాజేందర్‌, త్రివేది, బిక్షపతి, మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement