నర్సుల సేవలు వెలకట్టలేనివి

ABN , First Publish Date - 2021-05-13T06:23:59+05:30 IST

విపత్కర సమయంలో నర్సులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి పేర్కొన్నారు.

నర్సుల సేవలు వెలకట్టలేనివి

కదిరి, మే 12 : విపత్కర సమయంలో నర్సులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న 38 మంది నర్సులకు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి మొక్కలను శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల ఇనచార్జ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిస్సార్‌ అహమ్మద్‌, వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు నాగమల్లు, ఆజాద్‌, నబీరసూల్‌, పరికి సాధిక్‌, పిచ్చిలి శంకర్‌తో పాటు హెడ్‌నర్సులు, నర్సులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-13T06:23:59+05:30 IST