నర్సుల సేవలు వెలకట్టలేనివి

ABN , First Publish Date - 2021-05-13T05:19:56+05:30 IST

నర్సుల సేవలు వెలకట్టలేనివి

నర్సుల సేవలు వెలకట్టలేనివి
మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

గుజరాతీపేట: కరోనా బాధితులకు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలే నివని కలెక్టర్‌ నివాస్‌ పేర్కొన్నారు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సం దర్భంగా రాగోలు జెమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. కరోనా సోకిన వారి వద్దకు బంధువులే  వెళ్లడం లేదని, అలాంటిది వారికి అమ్మలా, చెల్లిలా, అక్కలా, కూతురులా సేవలందిస్తున్న నర్సులందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. షిఫ్టులు నిర్వహిస్తున్న నర్సింగ్‌ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. కరోనా రోగుల విషయంలో అలసత్వం వద్దని, గతం కంటే కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకొని పని చేస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు హేమంత్‌,  ప్రవీణ్‌, ఆర్‌ఎంవో జోత్స్న, సతీష్‌, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


కవిటి: కరోనా విజృంభిస్తున్న సమయంలో మనోధైర్యం కోల్పోకుం డా సేవలందిస్తున్న నర్సుల సేవలు మరువలేనివని కుసుంపురం గ్రామపెద్దలు శివ బిసాయి, సత్యం, ధర్మ తెలిపారు. బుధవారం కుసుంపురంలో   నర్సుల దినోత్సవం పురస్కరించుకొని   ఏఎన్‌ఎం లు, ఆశా కార్యకర్తలను సన్మానించారు. కార్యక్రమంలో ఏఎన్‌ ఎంలు ఎస్‌.కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి ఎన్‌.గుణ వతి పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-13T05:19:56+05:30 IST