సెల్ఫ్‌ సెంటర్‌ను మార్చాలి

ABN , First Publish Date - 2022-05-22T05:00:30+05:30 IST

కార్పొరేట్‌ పాఠశాలలతో సిద్దిపేట విద్యాశాఖ అధికారులు కుమ్మక్కు కావడంతోనే సిద్దిపేట శ్రీచైతన్య పాఠశాలకు ఎస్‌ఎ్‌ససీ సెల్ఫ్‌ సెంటర్లు వచ్చాయని ట్రస్మా రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లారెడ్డి ఆరోపించారు.

సెల్ఫ్‌ సెంటర్‌ను మార్చాలి

ట్రస్మా రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లారెడ్డి

సిద్దిపేట అగ్రికల్చర్‌, మే 21: కార్పొరేట్‌ పాఠశాలలతో సిద్దిపేట విద్యాశాఖ అధికారులు కుమ్మక్కు కావడంతోనే సిద్దిపేట శ్రీచైతన్య పాఠశాలకు ఎస్‌ఎ్‌ససీ సెల్ఫ్‌ సెంటర్లు వచ్చాయని ట్రస్మా రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లారెడ్డి ఆరోపించారు. శనివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ట్రస్మా వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివా్‌సరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెల్ఫ్‌ సెంటర్ల విషయమై డీఈవో కార్యాలయంలో అడుగగా కార్యాలయ సిబ్బంది పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆయన తెలిపారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎ్‌ససీ విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్నాయని, అందులో భాగంగా సిద్దిపేటలోని శ్రీచైతన్య పాఠశాల సెంటర్‌లో మరొక చైతన్య బ్రాంచ్‌ పాఠశాల విద్యార్థులు వారి పాఠశాలలోనే పరీక్షలు రాయనున్నారు. ఏ పాఠశాల విద్యార్థులు అయినా దాదాపు 10 సెంటర్లలో పరీక్షలు రాయనున్నారు. కానీ శ్రీచైతన్య పాఠశాల మాత్రం వారి సెల్ఫ్‌ సెంటర్‌లోనే కొంతమంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ట్రస్మా అధికార ప్రతినిధి వంగ దేవేందర్‌రెడ్డి, ట్రస్మా జిల్లా ప్రతినిధులు మధుమోహన్‌, తదితరులు పాల్గొన్నారు. 

సెల్ఫ్‌ సెంటర్‌ను రద్దు చేయాలి

సిద్దిపేట అర్బన్‌, మే 21: సిద్దిపేటలోని స్థానిక శ్రీచైతన్య కార్పొరేట్‌ పాఠశాల పదో తరగతి పరీక్ష సెల్ఫ్‌ సెంటర్‌ను రద్దుచేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎ్‌సఎఫ్‌) సిద్దిపేట జిల్లా కార్యదర్శి మన్నె కుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏవో అబ్దుల్‌ రహమాన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ  కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లని వేణు, సహాయ కార్యదర్శి సుబ్బులు, గడిపే సుజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:00:30+05:30 IST