సచివాలయాలు దేశానికే స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-01-28T05:37:07+05:30 IST

రాష్ట్ర ప్రగతికి సోపానాలుగా పటిష్టమైన సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు దేశానికే స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. గురువారం తాడేపల్లెలో క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సేవా 2.0 (జీఎ్‌సడబ్ల్యూఎస్‌) సిటిజన సర్వీస్‌ పోర్టల్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

సచివాలయాలు దేశానికే స్ఫూర్తిదాయకం
సిటిజన్‌ సర్వీస్‌ పోర్టల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్‌, జేసీ, ఎమ్మెల్యే తదితరులు

కలెక్టర్‌ విజయరామరాజు

ఏపీ సేవా 2.0 సిటిజన్‌ సర్వీస్‌ పోర్టల్‌ ప్రారంభం

కమలాపురం(రూరల్‌), జనవరి 27: రాష్ట్ర ప్రగతికి సోపానాలుగా పటిష్టమైన సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు దేశానికే స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. గురువారం తాడేపల్లెలో క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సేవా 2.0 (జీఎ్‌సడబ్ల్యూఎస్‌) సిటిజన సర్వీస్‌ పోర్టల్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కమలాపురం మండలంలోని నల్లింగాయపల్లె సచివాలయం నుంచి కలెక్టర్‌ విజయరామరాజుతో పాటు ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, జేసీ సాయికాంత్‌వర్మ హాజరయ్యారు. సీఎం కార్యక్రమం ముగిసిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనాపరంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఇప్పుడు దేశానికే ఆదర్శమైనదన్నారు. ఇప్పటికే 545 రకాలకు పైగా ప్రభుత్వ సేవలను అందిస్తున్న గ్రామ సచివాలయాల్లో పౌరసేవలను మరింత వేగంగా, నాణ్యతగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన ఏపీ సేవా 2.0 సిటిజన్‌ సర్వీస్‌ పోర్టల్‌ ప్రారంభించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ పోర్టల్‌ ద్వారా సమస్య ఎక్కడుందో కనుగొని వెంటనే రెక్టిఫై చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చుతున్న ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. అనంతరం నల్లింగాయపల్లె గ్రామ సచివాలయం వద్ద నూతనంగా నిర్మించిన విలేజ్‌ క్లినిక్‌ కేంద్రాన్ని కలెక్టర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ప్రసాద్‌రెడ్డి, డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్‌రెడ్డి, ఎంపీడీవో శారదారెడ్డి, తహసీల్దారు విజయకుమార్‌, ఎంపీపీ భారతి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:37:07+05:30 IST