జిల్లాలో రెండో దశకే పరిమితం

ABN , First Publish Date - 2020-04-10T10:48:09+05:30 IST

ఢిల్లీ మర్కజ్‌ సమావేశాల కు నల్లగొండ జిల్లా నుంచి 52మంది వెళ్లి రాగా అందులో పాజిటివ్‌గా వచ్చిన ఏడుగురికి హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రిలో

జిల్లాలో రెండో దశకే పరిమితం

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు

పాజిటివ్‌లకు హైదరాబాద్‌లో చికిత్స

మర్కజ్‌ బాధితులు 37మంది ఇంటికి చేరిక


నల్లగొండ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఢిల్లీ మర్కజ్‌ సమావేశాల కు నల్లగొండ జిల్లా నుంచి 52మంది వెళ్లి రాగా అందులో పాజిటివ్‌గా వచ్చిన ఏడుగురికి హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని కింగ్‌కోటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 8మంది ని గురువారం స్వగ్రామం పెద్దదేవులపల్లికి పంపారు. జిల్లాకేంద్రంలోని ఎంజీయూ క్వారంటైన్‌లో గల 37మ ంది నెగిటివ్‌ వ్యక్తులకు మరోసారి పరీక్షలు నిర్వహించి ఇళ్లకు పంపా రు. అదేవిధంగా ఇక్కడ అనుమానితుల జాబితాలో ఉన్న 40మందికి క్వారంటైన్‌ పీరియడ్‌ ముగియడంతో వారిని ఇళ్లకు పంపారు. పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో నల్లగొండ, మిర్యాలగూడలో ఆరు మునిసిపల్‌ వార్డులను రెడ్‌ జోన్లుగా ప్రకటించా రు.


ఈ వీధుల్లోని 9,216మందిని హోంక్వారంటైన్‌లో ఉంచారు. వీరందరిని 125మంది వైద్య సిబ్బంది ఆరు బృందాలుగా ఏర్పడి మూడు రోజుల పాటు అన్ని రకాల వివరాలు సేకరించారు. వీరిలో 115మంది సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. అయితే మరోసారి వీరిని  వైద్య బృందాలు సర్వే చేయనున్నాయి. నిర్ణీత కాల వ్యవధి ముగిసే వరకు కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించడంలో భాగంగా ఈ సర్వే కొనసాగుతుందని డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు తెలిపారు. జిల్లాలో రెండో దశకే కరోనా పరిమితమైందన్నారు.


శాలిగౌరారం అధికారులు అప్రమత్తం

శాలిగౌరారం  : సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్దమానుకోట గ్రామంలో కరోనా వైరస్‌ వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శాలిగౌరారం మండలం చిత్తలూర్‌ గ్రామానికి పక్కనే వర్దమానుకోట ఉండడంతో అక్కడి నుంచి శాలిగౌరారం మండలానికి కొందరు వచ్చి వెళ్లారని ప్రచారం సాగుతోంది. దీంతో గ్రామాల్లో భయం పట్టుకుంది. దీంతో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాకు సరిహద్దు గ్రామాలైన చిత్తలూర్‌, వంగమర్తి గ్రామాల వద్ద బుధవారం చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఇక్కడ గస్తీ కాస్తున్నారని ఎస్‌ఐ వై.హరిబాబు, తహసీల్దార్‌ ఎర్ర శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-04-10T10:48:09+05:30 IST