ఈ నెల 2న రెండో విడత కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-10-01T08:04:31+05:30 IST

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కొవిడ్‌ విధులు నిర్వర్తించడానికి సంబంధించిన పోస్టుల

ఈ నెల 2న రెండో విడత కౌన్సెలింగ్‌

డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరి 


కాకినాడ,సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో  కొవిడ్‌ విధులు నిర్వర్తించడానికి సంబంధించిన పోస్టుల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్‌ను 2వ తేదీన నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.సుబ్రహ్మణ్యేశ్వరి తెలిపారు. మొదటి విడతో ఎంపికై జాయిన్‌ కావడానికి ఆసక్తి చూపని వారిని జాబితా నుంచి తొలగించామన్నారు.


మెరిట్‌ జాబితాలోని తదుపరి అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. 57 స్టాఫ్‌ నర్సులు, 6 ఫార్మాసిస్ట్‌లు, 7 ల్యాబ్‌ టెక్నీషియన్‌లు, 4 ఎంఎన్‌వోలు, 6 ఎఫ్‌ఎన్‌వో పోస్టులకు ఈ నెల 2న కలెక్టరేట్‌లో మెరిట్‌, రోస్టర్‌ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు.

Updated Date - 2020-10-01T08:04:31+05:30 IST