రేపు కరోనా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ స్పెషల్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2021-04-21T05:05:58+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ వేసుకున్న వారికి రెండో డోస్‌ వేసుకునేందుకు వీలుగా ఈ నెల 22న గురువారం స్పెషల్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రేపు కరోనా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ స్పెషల్‌ డ్రైవ్‌

కడప, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ వేసుకున్న వారికి రెండో డోస్‌ వేసుకునేందుకు వీలుగా ఈ నెల 22న గురువారం స్పెషల్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవ్యాక్సిన్‌ టీకా వేసుకున్న వారు నాలుగు వారాలకు, కోవీ షీల్డ్‌ టీకా వేసుకున్న వారు 6 వారాలకు రెండో డోస్‌ తప్పక తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో 22న నిర్వహించే స్పెషల్‌ డ్రైవ్‌లో రెండవ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు.

Updated Date - 2021-04-21T05:05:58+05:30 IST