Abn logo
Sep 16 2021 @ 23:49PM

రెండో రోజు అదే జోరు

నాగిరెడ్డిపేట మండలంలో రెండో రోజు కొనసాగుతున్న బండి సంజయ్‌ పాదయాత్ర

నాగిరెడ్డిపేట, సెప్టెంబరు 16: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురు వారం నాగిరెడ్డిపేట మండలంలో రెండో రోజు అదే జో రుతో సాగింది. మండలంలో బుధవారం మొదటి రోజు పాదయాత్ర చేసి, బంజారా తండా గ్రామం వద్ద రాత్రి బస చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, జిల్లా బీజేపీ నేతలు బాణాల లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, వెంకట రమణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సంగప్ప, జిల్లా ఇన్‌చార్జీ మహిపాల్‌ రెడ్డి, కృష్ణారెడ్డిలతో పాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు.
గ్రామ గ్రామాన బండికి ఘన స్వాగతం
నాగిరెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాల వద్ద బండి సంజయ్‌కి ప్రజలు ఘన స్వాగతం పలికారు. లింగంపల్లి, తాండూర్‌, ధర్మారెడ్డి, రాఘవపల్లి, జప్తి జాన్క ంపల్లి, ఆత్మకూర్‌ గ్రామాల వద్ద బండి సంజయ్‌ పాదయాత్రకు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.
ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకుంటూ
మండలంలో పాదయాత్ర సందర్భంగా బండి సంజ య్‌, ఆయా గ్రామాల వద్ద ప్రజలు, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. లింగంపల్లి, తాండూర్‌, గ్రామాల వద్ద ప్రజలు పలు సమస్యల గురించి బండికి వినతిపత్రాల ను అందజేశారు. ధర్మారెడ్డి గ్రామంలో బండి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలందరికీ ఎల్లప్పుడు అండగా ఉంటానని భరోసా నిచ్చారు.
10 గ్రామాల మీదుగా 11 కిలో మీటర్లు
నాగిరెడ్డిపేట మండలంలో గురువారం బండి సంజ య్‌ పాదయాత్ర 10గ్రామాల మీదుగా 11 కిలో మీటర్లు సాగింది. బంజారా తండా నుంచి గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కాగా, ధర్మారెడ్డి, తాండూర్‌, రాఘవపల్లి, కన్నారెడ్డి, జప్తి జాన్కంపల్లి, కంపంల్లి, మెల్ల కుంట్ల తండా, రామక్కపల్లి, ఆత్మకూర్‌, అచ్చయ్యపల్లి గ్రామాల మీదుగా ఎల్లారెడ్డి మండలానికి బండి సంజ య్‌ పాదయాత్ర వెళ్లింది. పాదయాత్రలో స్థానిక మం డల బీజేపీ నాయకులు హన్మాండ్లు, శివకుమార్‌, గంప ల వెంకయ్య, నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.