పాఠశాలల బంద్‌ విజయవంతం

ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST

పాఠశాలల బంద్‌ విజయవంతం

పాఠశాలల బంద్‌ విజయవంతం
కడ్తాలలో క్యామ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు, నాయకులు

ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/కందుకూరు/యాచారం/కొత్తూర్‌/చేవెళ్ల/మొయినాబాద్‌/షాబాద్‌/షాద్‌నగర్‌ అర్బన్‌, జూలై 5: విద్యారంగ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని, విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులవుతున్నా పాఠ్యపుస్తకాలు, స్కూల్‌ డ్రెస్‌లు పంపిణీ చేయడం లేదని, పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించడం లేదని ఏబీవీపీ మంగళవారం పా ఠశాలల బంద్‌ నిర్వహించింది. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని నాయకులన్నారు. ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలలకు కొమ్ము కాస్తోందన్నారు. స్కూళ్లలో పుస్తకాలు, బు క్కులు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి సమస్యలను పరష్కరించాలని డిమాండ్‌ చేశారు. బంద్‌కు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులు సహకరించారు. ఆమనగల్లులో నాయ కుడు తహసీల్దార్‌ పాండునాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కడ్తాల్‌లో క్యామ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రాజు, మల్లేశ్‌, బాలు, దిలీప్‌, శివ, రాకేశ్‌, క్రాంతి, నవీన్‌, సాయిరామ్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు. తలకొండపల్లి ధర్నాలో బాలకృష్ణ, వెంకటేశ్‌, భరత్‌, రాజ్‌కుమార్‌, నరేశ్‌ పాల్గొన్నారు. కం దుకూరులో ఏబీవీపీ నగర కార్యదర్శి ఎ. సాయికిరణ్‌, విజేందర్‌, మర్రి కుమార్‌, భరత్‌, చరణ్‌, కె.రాఖేష్‌, రమేష్‌, ఎ.చందు, ఎ.రవిందర్‌, మధు, ప్రశాంత్‌, శేఖర్‌, శిగణేష్‌ పాల్గొన్నారు. యాచారం మండలంలో ఉదయం పాఠశాలల్లో ప్రార్థనలు కాగానే ఏబీవీపీ నాయకులు స్కూళ్లను మూసి వేయించారు. కొత్తూర్‌లో ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకు లను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషనకు తరలించారు. నరే్‌షచారి, శివకుమార్‌చారి, శ్రీకాంత్‌, హర్షయాదవ్‌, శశికాంత్‌, శరత్‌ పాల్గొన్నారు. చేవెళ్లలో ఏబీవీపీ నగర కార్యదర్శి శిరీష, కళ్లెం సూర్యప్రకాశ్‌, ప్రేంకుమార్‌, అభినవ్‌, ప్రవీణ్‌, శివ, ప్రవీణ్‌, రాజు, శివ, రామకృష్ణ, వంశీ, భూపాల్‌, నందు, అజయ్‌, రాజు, వినయ్‌, మ హేందర్‌, విజయ్‌, ఉదయ్‌కిరణ్‌ పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో ర్యాలీ నిర్వహించి బంద్‌ చేయించారు. పుట్నాల సాయికుమార్‌, భానుప్రసాద్‌, సందీప్‌, జగదీశ్‌, అజయ్‌, సల్మాన్‌, ఎజాజ్‌, కార్తీక్‌, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T05:30:00+05:30 IST