దేశంలో ఎక్కడా లేని పథకాలు మన రాష్ట్రంలోనే

ABN , First Publish Date - 2021-06-22T06:01:24+05:30 IST

దేశంలో ఎక్కడ లేని పథకాలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడా లేని పథకాలు మన రాష్ట్రంలోనే
సింధోల్‌ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌ రావు, ఎంపీ , ఎమ్మెల్యే

రేగోడు జూన్‌ 21: దేశంలో ఎక్కడ లేని పథకాలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌  అమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం రేగోడు మండలం సింధోల్‌ గ్రామానికి రూ 2.25 కోట్ల నిధులతో మంజూరైన రోడ్డు పనులను మంత్రి ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. రోడ్డు పక్కన హరితహారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు వర్షాకాలం వచ్చిందంటే పెట్టుబడి సాయం కోసం ఇబ్బందులు పడేవారని వివరించారు.  ఇప్పటికే ఎంతో మందికి రైతుబంధు సాయం రైతుల బ్యాంకు అకౌంట్లలో జమచేసినట్టు తెలిపారు.ఆరుతడి పంటగా జొన్నకు బదులు కంది, పత్తి ఇతర పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. త్వరలోనే ఎస్సీల అభివృద్ధికి మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సీఎం యోచిస్తున్నారన్నారు. సింధోల్‌ రోడ్డు కోసం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ పట్టుబడటంతో  ప్రత్యేక నిధుల నుంచి ఈ ఒక్క రోడ్డును మంజూరు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భిక్షపతి, జడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ సరోజన, సింధోల్‌ సర్పంచ్‌ మంజుల, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు బుచ్చయ్య, సుంకే రమేష్‌, వినోద కుమార్‌. సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-06-22T06:01:24+05:30 IST