చిన్ని కృష్ణుడి నోట్లో విశ్వం!

ABN , First Publish Date - 2020-07-25T05:30:00+05:30 IST

ఒకరోజు బలరాముడు, కృష్ణుడు, గోకులంలోని ఇతర పిల్లలందరూ కలిసి ఆడుకున్నారు. పిల్లలందరూ చెట్లపైకి ఎక్కి పండ్లు కోసుకుని తింటూ సరదాగా గడిపారు. చిన్ని కృష్ణుడు మట్టిలో ఆడుకుంటున్నాడు...

చిన్ని కృష్ణుడి నోట్లో విశ్వం!

ఒకరోజు బలరాముడు, కృష్ణుడు, గోకులంలోని ఇతర పిల్లలందరూ కలిసి ఆడుకున్నారు. పిల్లలందరూ చెట్లపైకి ఎక్కి పండ్లు కోసుకుని తింటూ సరదాగా గడిపారు. చిన్ని కృష్ణుడు మట్టిలో ఆడుకుంటున్నాడు. కృష్ణుడి నోటికి మట్టి అంటింది. అది చూసిన బలరాముడు, పిల్లలు కృష్ణుడు మట్టి తింటున్నాడని యశోదకు చెప్పారు. దాంతో యశోద పరుగుపరుగున వచ్చి ‘కృష్ణా! మట్టి తింటున్నావా!’ అని అడిగింది. అందుకు కృష్ణుడు ‘లేదమ్మా!’ అని సమాధానం ఇచ్చాడు. కానీ యశోద నమ్మలేదు. ‘నోరు తెరిచి చూపించు’ అని గట్టిగా అడిగింది. దాంతో కృష్ణుడు నోరు తెరిచి చూపించాడు. కృష్ణుడి నోట్లో మట్టి కనిపించలేదు. సూర్యుడు, నక్షత్రాలు, నదులు, పర్వతాలు.... ఇలా అన్నింటితో కూడిన విశ్వం కనిపించింది. అప్పుడు యశోదమ్మ చిన్ని కృష్ణుడు అందరిలా సామాన్యుడు కాదని అర్థం చేసుకుంది. 

Updated Date - 2020-07-25T05:30:00+05:30 IST