బ్రహ్మకమలం పూసేది ఇక్కడే!

ABN , First Publish Date - 2020-08-08T05:30:00+05:30 IST

అక్కడ అడుగుపెడితే స్వర్గంలో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. దూరంగా హిమాలయాలు, ఎటుచూసినా పూల వనాలతో ఆ ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని ‘వ్యాలీ ఆఫ్‌ ప్లవర్స్‌’ ప్రదేశం అత్యంత సుందరంగా ఉంటుంది...

బ్రహ్మకమలం పూసేది ఇక్కడే!

అక్కడ అడుగుపెడితే స్వర్గంలో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. దూరంగా హిమాలయాలు, ఎటుచూసినా పూల వనాలతో ఆ ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఉత్తరాఖండ్‌లోని ‘వ్యాలీ ఆఫ్‌ ప్లవర్స్‌’ ప్రదేశం అత్యంత సుందరంగా ఉంటుంది. ఇక్కడ 400 పైగా రకాల పూలు ఇక్కడి లోయల్లో కనిపిస్తాయి.

ట్రెక్కింగ్‌ చేసే వాళ్లకు ఈ ప్రదేశం అత్యంత ఇష్టమైనది. అరుదుగా కనిపించే బ్రహ్మకమలం ఇక్కడ పూస్తుంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర పుష్పం కూడా అదే. ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే తెలియకుండానే సమయం గడిచిపోతుంది. జూన్‌ మాసం నుంచి ఈ ప్రాంతం సందర్శనకు అనువుగా ఉంటుంది.


Updated Date - 2020-08-08T05:30:00+05:30 IST