ఆరో నెలలోనూ అదే దారి

ABN , First Publish Date - 2020-09-16T06:15:28+05:30 IST

భారత ఎగుమతుల రంగం వరుసగా ఆరో నెలలో కూడా క్షీణతను నమోదు చేసింది. ఆగస్టులో ఎగుమతులు 12.66

ఆరో నెలలోనూ అదే దారి

 ఎగుమతుల్లో 12.66 శాతం క్షీణత


న్యూఢిల్లీ: భారత ఎగుమతుల రంగం వరుసగా ఆరో నెలలో కూడా క్షీణతను నమోదు చేసింది. ఆగస్టులో ఎగుమతులు 12.66 శాతం క్షీణించి 2270 కోట్ల డాలర్లకే పరిమితం అయ్యాయి. పెట్రోలియం, లెదర్‌, ఇంజనీరింగ్‌ వస్తువులు, వజ్రాభరణాల ఎగుమతులు తగ్గడం ఇందుకు కారణం. కాగా దిగుమతులు కూడా 26 శాతం క్షీణించి 2947 కోట్లుగా నమోదు కావడంతో వాణిజ్య లోటు 677 కోట్ల డాలర్లుగా నిలిచింది.


ఆగస్టు నెలలో ఆయిల్‌ దిగుమతులు 41.62 శాతం తగ్గి 642 కోట్ల డాలర్లకు వచ్చాయి. బంగారం దిగుమతులు గత ఏడాది ఆగస్టుతో పోల్చితే 136 కోట్ల డాలర్ల నుంచి 370 కోట్ల డాలర్లకు పెరిగాయి. కాగా ఏప్రిల్‌-ఆగస్టు నెలల మధ్య కాలంలో ఎగుమతులు 26.65 శాతం క్షీణించి 9766 కోట్ల డాలర్లకు చేరగా దిగుమతులు 43.73 శాతం క్షీణించి 11,838 కోట్ల డాలర్లకు వచ్చాయి. ఇదే కాలంలో వాణిజ్య లోటు 2,072 కోట్ల డాలర్లుంది. 

Updated Date - 2020-09-16T06:15:28+05:30 IST