అందరికీ ‘ఒకే పరీక్షా?’

ABN , First Publish Date - 2021-06-20T08:43:18+05:30 IST

సమాజంలో పేద, ధనిక అనే రెండు వర్గాలకు వేర్వేరు విద్యావిధానాలు అమలవుతున్న తరుణంలో విద్యార్థుల అర్హతను బేరీజు వేసేందుకు జాతీయ స్థాయిలో ఒకే పరీక్షా విధానాన్ని

అందరికీ ‘ఒకే పరీక్షా?’

ఇదేం సామాజిక న్యాయం

‘నీట్‌’పై హీరో సూర్య ధ్వజం


చెన్నై, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): సమాజంలో పేద, ధనిక అనే రెండు వర్గాలకు వేర్వేరు విద్యావిధానాలు అమలవుతున్న తరుణంలో విద్యార్థుల అర్హతను బేరీజు వేసేందుకు జాతీయ స్థాయిలో ఒకే పరీక్షా విధానాన్ని అమలు చేయడం ఏమేరకు సమంజసమని హీరో సూర్య ప్రశ్నించారు. వైద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్‌ ప్రవేశ పరీక్షను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై అభిప్రాయ సేకరణ కోసం ప్రభుత్వం రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ఏకే రాజన్‌ సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి అనేకమంది తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘అగరం ఫౌండేషన్‌’ పేరుతో విద్యా సంస్థను నడుపుతున్న హీరో సూర్య కూడా తమ అభిప్రాయాలను కమిటీకి తెలిపారు. ప్రజలు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలను కమిటీకి తెలియజేయాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-06-20T08:43:18+05:30 IST