నారాయణపేటలో ఒకే కేసు

ABN , First Publish Date - 2020-11-01T08:06:08+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసులు విపరీతంగా

నారాయణపేటలో ఒకే కేసు

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 101 కేసులు నమోదు

అడ్డాకుల మండలంలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)/గద్వాల క్రైం/నాగర్‌కర్నూల్‌ క్రైం/నారాయణపేట క్రైం/వనపర్తి, అక్టోబరు 31 : కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసులు విపరీతంగా నమోదయ్యాయి. ఆ తరువాత ఒక్క కేసు కూడా నమోదు కాని వనపర్తి జిల్లాలో వైరస్‌ తిష్ట వేసింది. అనంతరం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కూడా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగింది. కానీ, ఒక్క నారాయణపేట జిల్లాలో మాత్రం పాజిటివ్‌ కేసులు మాత్రం పెద్దగా నమోదు కాలేదు. తాజాగా ఈ జిల్లాలో ఒక్కరికే పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 101 కేసులు వచ్చాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలంలో ఓ 65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది.


మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా 18 కేసులు నమోదు కాగా, అందులో జిల్లా కేంద్రంలోనే 9 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మిగిలిన తొమ్మిది కేసులు ఇతర మండలాల్లో వచ్చాయి. కాగా, అడ్డాకుల మండలంలో 65 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది.


జోగుళాంబ గద్వాల జిల్లాలో పది మందికి కరోనా సోకింది. అందులో జిల్లా కేంద్రంలోనే ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వివిధ మండలాల్లో మరో ఏడుగురు వైరస్‌ బారిన పడ్డారు.


నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 55 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట మండలాల్లో 11 కేసుల చొప్పున నమోదయ్యాయి. మిగిలిన 33 కేసులు వివిధ మండలాల్లో వచ్చాయి.


వననర్తి జిల్లా వ్యాప్తంగా 17 కరోనా కేసులు నమోదు కాగా, అత్యధికంగా వనపర్తి మండలంలో ఏడుగురికి వైరస్‌ సోకింది. మిగిలిన పది కేసులు వివిధ మండలాల్లో నమోదయ్యాయి.


నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక కరోనా కేసు నమోదైంది.

Updated Date - 2020-11-01T08:06:08+05:30 IST