Abn logo
Sep 26 2021 @ 00:48AM

ప్రభుత్వరంగ సంస్థల విక్రయం దేశ ప్రగతికి చేటు

దీక్షా శిబిరంలో పాల్గొన్న ఉద్యోగులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు

కూర్మన్నపాలెం, సెప్టెంబరు 25: ప్రభుత్వరంగ సంస్థల విక్రయం దేశ ప్రగతికి చేటును కలిగిస్తుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 226వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో సీవో సీసీడీ విభాగ కార్మికులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో రామారావు  మాట్లాడుతూ  రాజ్యాంగాన్ని గౌరవించని వారు పాలకులుగా ఉండటం మన దురదృష్టమన్నారు.     విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు ప్రజలు  తగు రీతిలో బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆనంద్‌ కుమార్‌, రఫీ, జ్యోతి ప్రసాద్‌, రామ్‌ కుమార్‌, దేముడు నాయుడు, నీరుకొండ రామచంద్రరావు, సత్యనారాయణ, పరందామయ్య, మురళీరాజు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, బోసుబాబు, విళ్ల రామ్మోహన్‌ కుమార్‌, దొమ్మేటి అప్పారావు, సోమునాయుడు, భానుమూర్తి, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.