ప్రభుత్వరంగ సంస్థల విక్రయం తగదు

ABN , First Publish Date - 2021-10-29T04:22:55+05:30 IST

ప్రభుత్వరంగ సంస్థల విక్రయం తగదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలోని గురువారం 259వ రోజు రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న ఆర్‌ఎంహెచ్‌ిపీ, ఆర్‌ఎండీ విభాగాల ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ ఈ నెల 30న పాత గాజువాక నుంచి వినాయకనగర్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం ఓపెన్‌ ఆడిటోరియంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వరంగ సంస్థల విక్రయం తగదు
బహిరంగ సభల వాల్‌పోస్టర్‌లను ఆవిష్కరిస్తున్న దృశ్యం

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ 


కూర్మన్నపాలెం, అక్టోబరు 28: ప్రభుత్వరంగ సంస్థల విక్రయం తగదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలోని గురువారం 259వ రోజు రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న ఆర్‌ఎంహెచ్‌ిపీ, ఆర్‌ఎండీ విభాగాల ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ ఈ నెల 30న పాత గాజువాక నుంచి వినాయకనగర్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం ఓపెన్‌ ఆడిటోరియంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని కార్పొరేట్‌ శక్తుల చేతిల్లో కీలుబొమ్మగా మారారన్నారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నల్లధనం వెలికితీత పేరుతో ప్రజలను అనేక కష్టాలపాలు చేస్తోందన్నారు. జీఎస్టీ పేరుతో దోచేస్తోందని, పభుత్వ రంగం ప్రైవేటీకరణను నిలువరించేందుకు రాజకీయ నేతలంతా ఏకతాటిపైకి రావాలన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని విస్మరించి నిరంకుశ పాలనను కొనసాగిస్తోందని తీవ్రంగా విమర్శించారు. అనంతరం నేతలంతా బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌, కో కన్వీనర్‌ గంధం వెంకట్రావు, పలువురు ఉక్కు ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T04:22:55+05:30 IST