మినీ అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలి

ABN , First Publish Date - 2022-07-04T05:23:44+05:30 IST

మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు మెయిన్‌ వర్కర్స్‌తో సమానంగా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు డిమాండ్‌ చేశారు.

మినీ అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలి
సదస్సులో మాట్లాడుతున్న సీహెచ్‌.నరసింగరావు

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు 

మహారాణిపేట, జూలై 3: మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు మెయిన్‌ వర్కర్స్‌తో సమానంగా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నరసింగరావు మాట్లాడుతూ మినీ అంగన్‌వాడీ కార్యకర్తలతో ప్రభుత్వం బానిసలు మాదిరిగా పనిచేయిస్తున్నదని ఆరోపించారు.  అంగనవాడీ కేంద్రాలలో అన్ని వంటలు చేస్తూ, పిల్లలకు విద్య కూడా నేర్పిస్తున్న మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు కేవలం ఆయా జీతం మాత్రమే ఇస్తున్నారని వివరించారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రత్యేకంగా ఆయాలను నియమించాలని, లేకుంటే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి నాగశేషు, కె.సుబ్బరావమ్మ, పి.మణి, చంద్రవతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:23:44+05:30 IST