సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-11T05:34:17+05:30 IST

స్వాతంత్య్ర ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన సమరయోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకొని భావితరాలకు అం దించాలనే సంకల్పంతో ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు.

సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి
మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే, మేయర్‌

- ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

కోల్‌సిటీ, ఆగస్టు 10: స్వాతంత్య్ర ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన సమరయోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకొని భావితరాలకు అం దించాలనే సంకల్పంతో ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా బుధవారం రామగుం డం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ టౌన్‌షిప్‌ ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రీడం పార్కును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశభక్తి భావన ప్రతీఒక్కరిలో మేల్కొల్పాలనే భావనతో ఇంటింటా జెండా ఎగురవే యడంతో పాటు 15రోజుల కార్యక్రమాలను నిర్వహిం చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారన్నారు.  కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఫ్రీడం పార్కులో ఎమ్మెల్యే చందర్‌, మేయర్‌ అనిల్‌ కుమార్‌, అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ సోమనాథ్‌, మయాంక్‌, పలువురు కార్పొరేటర్లు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T05:34:17+05:30 IST