సైనికుల త్యాగాలను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2021-01-16T05:35:37+05:30 IST

మన రక్షణ కోసం సరిహద్దులో ప్రాణాలను అర్పిస్తున్న సైనికుల త్యాగాలను స్మరించుకోవాలని ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ అధ్యక్షుడు కూర పొచ్చన్న అన్నారు.

సైనికుల త్యాగాలను స్మరించుకోవాలి

ఆదిలాబాద్‌టౌన్‌, జనవరి 15: మన రక్షణ కోసం సరిహద్దులో ప్రాణాలను అర్పిస్తున్న సైనికుల త్యాగాలను స్మరించుకోవాలని ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ అధ్యక్షుడు కూర పొచ్చన్న అన్నారు. జాతీయ ఆర్మీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలో 5కే రన్‌ నిర్వహించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి రన్‌ను జెండా ఊపి ఫిట్‌ ఇండియా అధ్యక్షుడు ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల సాగిన రన్‌ తిరిగి స్టేడియానికి చేరుకుంది. ఇందులో భాగంగానే రిటైర్డ్‌ ఆర్మీ జవాన్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్‌ అధ్యక్షుడు ఊశన్న, ఫిట్‌ ఇండియా ఫౌండేషన్‌ ప్రతినిధులు వెంకటి, శేఖర్‌, విరాట్‌, కార్తీక్‌, దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.  సార్క్‌ నేషన్‌ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో సైనికుల దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో సైనికుల ఫ్లెక్సీకి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సార్క్‌నేషన్‌ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం నాయకులు పున్నంరావ్‌, ఉదయ్‌, కిరణ్‌కుమార్‌, మేస్రంకృష్ణ, వెంకటపతి, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. అటు బీసీ సంఘ భవనంలో సంఘం సభ్యులు ఆర్మీ సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. ఇందులో డీఎస్పీ వెంకటేశ్వర్లు, ప్రమోద్‌కుమార్‌ఖత్రి, పార్థసారథి తదితర నాయకులున్నారు. 

Updated Date - 2021-01-16T05:35:37+05:30 IST