Abn logo
Oct 22 2021 @ 00:41AM

పోలీసుల త్యాగాలు మరవలేనవి

కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.10లక్షల చెక్కును అందజేస్తున్న ఎపీఎస్పీ 14బెటాలియన కమాండెంట్‌ ప్రకాష్‌
: ఏపీఎస్పీ 14బెటాలియన కమాండెంట్‌ ప్రకాష్‌ 

 బుక్కరాయసముద్రం, అక్టోబరు21: విధి నిర్వహణలో ఆశువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు, సేవలు మరవలేనివని ఏపీఎస్పీ 14బెటాలియన కమాండెంట్‌ ప్రకాష్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని జంతులూరు వద్ద ఉన్న 14వ ఏపీఎస్పీ బెటాలియనలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. పేరేడ్‌ మైదానంలోని అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్‌ నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీక రించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....  కరోనా విపత్క ర పరిస్థితులో పోలీసులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహించారన్నారు.  గత ఏడాది విష్ణ చంద్ర అనే కానిస్టే బుల్‌ కరోనాతో మృతి చెందాడన్నారు. ఆ కుటుంబానికి రూ.10లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్‌ నాగేశ్వరప్ప  ఆర్‌ఐ వెంకటేశ్వరనాయుడు తదితరులు పాల్గొన్నారు.