రైతుల త్యాగాలు వెలకట్టలేనివి

ABN , First Publish Date - 2022-05-29T05:40:26+05:30 IST

ప్రాజెక్టులకు భూములిచ్చే రైతుల త్యాగాలు వెలకట్టలేనివని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు అన్నారు.

రైతుల త్యాగాలు వెలకట్టలేనివి
రైతులకు చెక్కులు అందిస్తున్న రవీందర్‌రావు

- నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి 

- భూములు కోల్పోయిన రైతులకు చెక్కుల పంపిణీ 

వీర్నపల్లి, మే 28: ప్రాజెక్టులకు భూములిచ్చే రైతుల త్యాగాలు వెలకట్టలేనివని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో కాళేశ్వరం మూడో ప్యాకేజీ పైప్‌లైన్‌ పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు ఎంపీపీ మాలోతు భూల, జడ్పీటీసీ గుగ్లోతు కళావతి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కొంత మంది రైతులు నష్టపోతే భవిష్యత్‌లో చాలా మందికి ప్రయోజనం చేకూరుతుందని భూములు ఇస్తున్నారని తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పరిహారం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుసుకోవాలన్నారు. ఉమ్మడి వీర్నపల్లి, మద్దిమల్ల 128 మంది రైతులకు రూ. 62 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. రెండు రోజుల్లో రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో రైతులకు చెక్కులు అందిస్తారని తెలిపారు. ఏఎంసీ చైర్మన్‌ కొండ రమేష్‌గౌడ్‌, జడ్పీ కోఆప్షన్‌ చాంద్‌పాషా, మండల కోఆప్షన్‌ ఉస్మాన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, తహసీల్దార్‌ తఫాజుల్‌ హుస్సేన్‌, నాయకులు సంతోష్‌, రఫీ, నాగరాజు ఉన్నారు.


Updated Date - 2022-05-29T05:40:26+05:30 IST