Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం

అమరవీరుల స్ధూపం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఇన్‌చార్జీ కమాండెంట్‌ సురేష్‌

హాజీపూర్‌, అక్టోబరు 21: పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఇన్‌చార్జి కమాండెంట్‌ ఎంఐ సురేష్‌ అ న్నారు. గుడిపేటలోని 13వ బెటాలియన్‌లో గురువా రం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సం దర్భంగా స్ధూపం వద్ద నివాళులర్పించారు. మాట్లాడు తూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగం వెల కట్టలేనిదన్నారు. అసిస్టెంట్‌ కమాండెంట్లు భిక్షపతి, రఘునాధ్‌చౌహాన్‌, గుడిపేట సర్పంచు లక్ష్మీరా జయ్య, ఎంపీపీ స్వర్ణలతశ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

ఫ బెల్లంపల్లి: పోలీసు అమరుల త్యాగం భావిత రాలకు స్ఫూర్తిదాయకమని డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బెల్లంపల్లి ఆర్ముడ్‌ రిజర్వ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.  డీసీపీ, మంచిర్యాల ఏసీపీ అఖిల్‌మహాజన్‌లు పోలీసుల గౌర వ వందనం స్వీకరించారు. డీసీపీ మాట్లాడుతూ శాం తిభద్రతల పరిరక్షణతోపాటు దేశంలో అంతర్గత భద్ర త, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో పోలీ సు వ్యవస్థ కీలకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు, ఆర్మీ శాఖలకు చెం దిన 377 మంది అధికారులు వివిధ సంఘటనల్లో అమరులయ్యారని పేర్కొన్నారు. ఫ్లాగ్‌ డే సందర్భంగా నెలాఖరు వరకు ఆయుధాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. బెల్లం పల్లి ఏసీపీ సీఏఆర్‌ మల్లికార్జున్‌, సీఐ రాజు, సీఐ జగదీష్‌, ఆర్‌ఐ అడ్మిన్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. 

- ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీ సులు చేస్తున్న కృషి మరువలేనిదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బాయిజమ్మ సాయిసేవా ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలో మహా అన్నదాన కార్యక్రమా న్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఏసీపీ ఎడ్ల మహేష్‌లు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాయిజమ్మ సాయిసేవా సభ్యులు అన్నదానం నిర్వహించడం సం తోషంగా ఉందని తెలిపారు. ట్రస్టు వ్యవస్థాపకులు రాజేశ్వరిశంకర్‌, ట్రస్టు మేనేజర్‌ సతీష్‌,  పాల్గొన్నారు.  

Advertisement
Advertisement